Govt and Contract Jobs in NIEPID : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (National Institute for the Empowerment of Persons with Disabilities (Divyangjan)-NIEPID) లో రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. NIEPID కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. NIEPID హైదరాబాద్, MSEG నోయిడా, CRC దావణగెరెలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు, CRC నెల్లూరు, CRC రాజ్ నంద్ గావ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
Job Details
NIEPID HQs, Secunderabad
Group-A
పోస్టు పేరు: స్పెషల్ ఎడ్యుకేషన్ లో లెక్చరర్
పోస్టుల సంఖ్య: రెండు (02), అన్ రిజర్వ్-01, ఎస్సీ-01
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-10, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ.
– స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఏడాది డిప్లొమా, లేదా మెంటల్లీ రిటార్డెడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో బీఈడీ.
– స్పెషల్ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల అనుభవం. వృత్తి శిక్షణ, ఉద్యోగ నియామకాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
Group-B
పోస్టు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-7, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా డిగ్రీ.
– ఎస్టాబ్లిష్ మెంట్ లో ఐదేళ్ల పర్యవేక్షణ సామర్థ్యం
– కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై పరిజ్ఞానం.
– కొనుగోలు విధానాలు, స్టోర్ రికార్డుల నిర్వహణ, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
పోస్టు పేరు: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్
పోస్టుల సంఖ్య: రెండు (02), అన్ రిజర్వ్
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-7, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా డిగ్రీ. స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్లీ రిటార్డెడ్)లో డిప్లొమా లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్లీ రిటారైడ్)లో బీఈడీ. లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ లో స్పెషలైజేషన్ తో పాటు బీ.ఆర్.ఎస్(మెంటల్లీ రిటార్డెడ్).
– స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్లీ రిటార్డెడ్)లో ప్రొఫెషనల్ గా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)లో నమోదు చేసుకొని ఉండాలి.
పోస్టు పేరు: ఎల్డీసీ(LDC)/ టైపిస్ట్
పోస్టుల సంఖ్య: మూడు (03), అన్ రిజర్వ్-01, ఓబీసీ-01, ఎస్సీ-01
వయసు: 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: పోస్టు లెవల్-2, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి.
– మాన్యువల్ టైప్ రైటర్ లో నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు టైప్ చేయాలి. లేదా కంప్యూటర్ లో 35 పదాలు టైప్ చేయగలగాలి.
పోస్టు పేరు: హిందీ టైపిస్ట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-2, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– పదో తరగతి పాసై ఉండాలి.
– నిమిషానికి 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.
NIEPID MSEC, Noida
Group-A
పోస్టు పేరు: ప్రిన్సిపల్ ఎంఎస్ఈసీ
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్ (OH)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-12, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– సోషల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీతో పాటు M.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్లీ రిటార్డెడ్)
– స్పెషల్ స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
CRC, Devangre (Karnataka)
Group-A
పోస్టు పేరు: లెక్చరర్ (ఆక్యుపేన్షల్ థెరపీ)
పోస్టుల సంఖ్య: ఒకటి (01), ఓబీసీ (OBC)
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-10, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూషన్ లో ఆక్యుపేన్షల్ థెరపీలో మాస్టర్స్ చేసి ఉండాలి.
– రిహాబిలిటేషన్ లో మూడు సంవత్సరాల టీచింగ్ లేదా రీసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-10, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఎంబీఏ చేసి ఉండాలి.
– ప్రభుత్వ సంస్థలో మూడు సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ అనుభవం అవసరం.
Group-B
పోస్టు పేరు: ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-7, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ లో డిగ్రీ చేసి ఉండాలి.
– సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల అనుభవం అవసరం.
పోస్టు పేరు: ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్ స్ట్రక్టర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వ్
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పోస్టు లెవల్-6, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు:
– గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్ స్ట్రక్షన్ లో డిగ్రీతోపాటు డిప్లొమా చేసి ఉండాలి.
– సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాల టీచింగ్ మరియు ట్రెయినింగ్ అనుభవం అవసరం.
CRC, Nellore, (Contractual basis)
Group-A
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (Medical PMR)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.70,000
అర్హతలు:
– మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
– క్లినికల్, టీచింగ్, రీసెర్చ్ విభాగాల్లో మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
– పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ రిహాబిలిటేషన్ లో Ph.D చేసి ఉండాలి.
Group-B
పోస్టు పేరు: క్లినికల్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు:
– సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థలో డిగ్రీ చేసి ఉండాలి.
– క్లినికల్ లేదా రీసెర్చ్ లో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
Group-C
పోస్టు పేరు: క్లర్క్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.22,000
అర్హతలు:
– ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
– కంప్యూటర్లో నిమిషంలో 35 ఇంగ్లిష్ పదాలు టైప్ చేయగలగాలి.
– రెండు సంవత్సరాల అనుభవం అవసరం
CRC, Rajnandgaon
Group-A
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (Medical PMR)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ. 70,000
అర్హతలు:
– మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో ఎంబీబీఎస్ తోపాటు పీడీ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
– క్లినికల్, టీచింగ్, రీసెర్చ్ విభాగాల్లో మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
Group-B
పోస్టు పేరు: స్పెషల్ ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్ స్ట్రక్టర్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు:
– ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్ స్ట్రక్షన్ లో డిప్లొమా చేసి ఉండాలి.
– సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాల టీచింగ్ మరియు ట్రెయినింగ్ అనుభవం అవసరం.
Terms and Conditions
- అభ్యర్థులు భారతదేశ పౌరులై ఉండాలి.
- నోటిఫికేషన్ లో సూచించిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
- జనరల్ అభ్యర్థులు Director, NIEPID పేరిట రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం. డీడీ వెనక అభ్యర్థి పేరు. దరఖాస్తు చేసుకొన్న పోస్టు పేరు రాయాలి.
How to Apply
అర్హులైన అభ్యర్థులు NIEPID వెబ్ సైట్ లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటిని సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. వాటన్నింటితోపాటు డీడీని ఓ ఎనవలప్ కవర్ లో పెట్టి, కవర్ పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఆ కవర్ ను ఈ నోటిఫికేషన్ వెలువడిన 45 రోజుల లోపు the Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009 చిరునామాకు పంపించాలి. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసి రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
– Govt and Contract Jobs in NIEPID