IELTS Training Program For Nurses : తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు పూర్తిచేసి.. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) (International English Language Testing System-IELTS)పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్వంలోని (A Government of Telanagana State Undertaking) తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)(Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) ప్రకటన విడుదల చేసింది. ఈ శిక్షణ మే నెలలో ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షణ పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులకు అమెరికా, యూకే, కెనడా దేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టామ్‌కామ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.
Training Durataion
ఈ శిక్షణ 30 రోజుల (ఒక నెల) పాటు ఉంటుంది. మే నెలలో నిర్వహిస్తారు. అపార అనుభవం కలిగిన క్వాలిఫైడ్ ట్రైనర్స్‌తో శిక్ష ఇస్తారు. మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మెటీరియల్ కూడా అందజేస్తారు.
Timings
ఈ ట్రైనింగ్ ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆన్లైన్లో శిక్షణ ఇస్తారు.
Eligibility
ఈ శిక్షణకు బీ.ఎస్సీ (నర్సింగ్) B.Sc(Nursing) చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Fee
ఈ ట్రైనింగ్‌కు నెలకు రూ.5,000 ఫీజు వసూలు చేస్తున్నట్టు టామ్‌కామ్ వెల్లడించింది.
How to Apply
ఆసక్తి కలిగిన అభ్యర్థులు టామ్‌కామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా 7901290580, 9502894238 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Role of TOMCOM
- తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) (Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన శిక్షణ ఇచ్చి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటుంది.
- విద్యార్థులు అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
- విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.
- విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ అప్ గ్రేడేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది.
- అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తుంది.
- ఓవర్సీస్ ఎంప్లాయర్స్ మీటింగ్ నిర్వహిస్తుంది.
- రిక్రూటింగ్ ఏజెంట్ల సమావేశం, శిక్షకుల శిక్షణ వర్క్‌షాప్‌లు మొదలైనవి ఏర్పాటు చేస్తుంది.
- ప్రయాణం, పాస్‌పోర్ట్, వీసా మరియు స్టాంపింగ్ సహాయం అందించడంలో సహాయపడుతుంది.
- విదేశీ పని పరిస్థితులు, పని వాతావరణం మరియు అక్కడి కల్చర్ తో పరిచయం చేయడానికి సహకరిస్తుంది.
- ఇతర దేశాలలో జాబ్ మార్కెట్ డిమాండ్లను అంచనా వేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.
టామ్‌కామ్ చిరునామా :
Telangana Overseas Manpower Company Ltd,
ITI Mallepally Campus,Hyderabad-500057.
Phone: 040-23342040 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేయొచ్చు)
e-mail: [email protected]
Website: www.tomcom.telangana.gov.in
– IELTS Training Program For Nurses