Education

IELTS Training Program For Nurses

IELTS Training Program For Nurses : తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్​, పారా మెడికల్ కోర్సులు పూర్తిచేసి.. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న​ అభ్యర్థులకు ఇంటర్నేషనల్​ ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ టెస్టింగ్ సిస్టమ్​​ (ఐఈఎల్​టీఎస్​) (International English Language Testing System-IELTS)పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్వంలోని (A Government of Telanagana State Undertaking) తెలంగాణ ఓవర్సీస్​ మ్యాన్​పవర్​ కంపెనీ లిమిటెడ్​ (టామ్​కామ్​)(Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) ప్రకటన విడుదల చేసింది. ఈ శిక్షణ మే నెలలో ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షణ పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులకు అమెరికా, యూకే, కెనడా దేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టామ్​కామ్​ యాప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.

Training Durataion

ఈ శిక్షణ 30 రోజుల (ఒక నెల) పాటు ఉంటుంది. మే నెలలో నిర్వహిస్తారు.  అపార అనుభవం కలిగిన క్వాలిఫైడ్​ ట్రైనర్స్​తో శిక్ష ఇస్తారు. మాక్​ టెస్టులు నిర్వహిస్తారు. మెటీరియల్​ కూడా అందజేస్తారు.

Timings

ఈ ట్రైనింగ్​ ఆన్​లైన్​ మరియు ఆఫ్​లైన్​లో ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆఫ్​లైన్​లో, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆన్​లైన్​లో శిక్షణ ఇస్తారు.

Eligibility

ఈ శిక్షణకు బీ.ఎస్సీ (నర్సింగ్​) B.Sc(Nursing) చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

Fee

ఈ ట్రైనింగ్​కు నెలకు రూ.5,000 ఫీజు వసూలు చేస్తున్నట్టు టామ్​కామ్​ వెల్లడించింది.

How to Apply

ఆసక్తి కలిగిన అభ్యర్థులు టామ్​కామ్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. లేదా 7901290580, 9502894238 నెంబర్లకు ఫోన్​ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Role of TOMCOM

  • తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) (Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) నర్సింగ్​ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన శిక్షణ ఇచ్చి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటుంది.
  • విద్యార్థులు అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
  • విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.
  • విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ అప్ గ్రేడేషన్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది.
  • అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తుంది.
  • ఓవర్సీస్ ఎంప్లాయర్స్ మీటింగ్ నిర్వహిస్తుంది.
  • రిక్రూటింగ్ ఏజెంట్ల సమావేశం, శిక్షకుల శిక్షణ వర్క్‌షాప్‌లు మొదలైనవి ఏర్పాటు చేస్తుంది.
  • ప్రయాణం, పాస్‌పోర్ట్, వీసా మరియు స్టాంపింగ్ సహాయం అందించడంలో సహాయపడుతుంది.
  • విదేశీ పని పరిస్థితులు, పని వాతావరణం మరియు అక్కడి కల్చర్ తో పరిచయం చేయడానికి సహకరిస్తుంది.
  • ఇతర దేశాలలో జాబ్ మార్కెట్ డిమాండ్‌లను అంచనా వేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.

టామ్​కామ్​ చిరునామా :

Telangana Overseas Manpower Company Ltd,
ITI Mallepally Campus,Hyderabad-500057.
Phone: 040-23342040 (ఉదయం 1‌‌0 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్​ చేయొచ్చు)
e-mail: tomcom.gmts@gmail.com
Website: www.tomcom.telangana.gov.in

– IELTS Training Program For Nurses

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago