Jobs in DEIC Banswada : కామారెడ్డి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM)లో భాగంగా చేపట్టిన రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమం (Rashtriya Bal Swasthya Karyakram-RBSK) లో బాన్సువాడలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (District Early Intervention Center-DEIC) లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (RC.No.2115/RBSK/NHM/DM&HO/KMR/2023) వెలువడింది. మొత్తం 12 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం (District Health and Medical Officer, Kamareddy)లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Pediatrician – 01
2. Medical Officer Dental – 01
3. Physiotherapist – 01
4. Audiologist and Speech Therapist – 01
5. Psychologist – 01
6. Optometrist – 01
7. Early Interventionist cum Special Educator – 01
8. Social Worker – 01
9. Lab Technician – 01
10. Staff Nurse – 01
11. Dental Technician – 01
12. DEIC Manager – 01
పీడియాట్రీషియన్:
ఎంబీబీఎస్ చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం కింద ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. ఒకవేళ ఎండీ (పీడియాట్రీషియన్) చేసివారు అందుబాటులో లేకుంటే డీసీహెచ్ చేసివారికి అవకాశం ఇస్తారు.
మెడికల్ ఆఫీసర్ డెంటల్:
బీడీఎస్ చేసి ఉండాలి. టీఎస్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టంతో రిజిస్టరై ఉండాలి.
ఫిజియోథెరపిస్ట్:
ఇండియాలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు టీఎస్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టరై ఉండాలి.
ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ :
ఇండియాలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి స్పీచ్ అండ్ లాంగ్వేజి పాథాలజిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు టీఎస్ పారామెడికల్ బోర్డ్ లో రిజిస్టరై ఉండాలి.
సైకాలజిస్ట్ :
ఇండియాలోని ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి చైల్డ్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
ఆప్టోమెట్రిస్ట్ :
ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఆప్టోమెట్రీలో మాస్టర్స్ డిగ్రీ మరియు టీఎస్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టరై ఉండవలెను.
ఎర్లీ ఇంటర్వెన్షనస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్:
అక్యుపేషనల్ థెరపీ/ ఫిజియోథెరపి (బీపీటీ)లో బేసిస్ డిగ్రీతో ఎం. ఎస్సి ఇన్ డిజేబిలిటీ స్టడీస్ (ఎర్ల్ ఇంటర్వెన్షన్).
సోషల్ వర్కర్:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్/ సోషల్ సైన్స్ చేసి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ :
ఇంటర్మీడియెట్ పాసై.. గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూషన్స్ నుండి డీఎంఎల్టీ లేదా బీఎస్సీ (ఎల్టీ) చేసి ఉండాలి. అలాగే, టీఎస్ పారా మెడికల్ బోర్డ్ లో తప్పక రిజిస్టరై ఉండాలి.
స్టాఫ్ నర్స్ :
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) లేదా B.Sc(Nursing) చేసి ఉండాలి.
డెంటల్ టెక్నీషియన్ :
ఎస్సెస్సీ పాసై.. డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ చేసి ఉండాలి.
డీఈఐసీ మేనేజర్:
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ) చే ఆమోదించబడిన మాస్టర్స్ ఇన్ డిజేబిలిట్ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎండీఆర్ఏ), బీపీటీలో ప్రాథమిక అర్హత (బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపి), బీఓటీ ( బ్యాచిలర్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ), బీపీవో (బ్యాచిలర్ ఇన్ ప్రొస్తెటిక్ అండ్ ఆర్తోటిక్స్), ), బీ.ఎస్సీ (నర్సింగ్) మరియు ఇతర ఆర్సీఐ గుర్తించిన డిగ్రీ చేసి ఉండాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లా అధికారి వెబ్సైట్ (https://kamareddy.telangana.gov.in/)ను ఓపెన్ చేయాలి. అందులో అందులో నిర్ణీత ఫార్మాట్లో Application Form ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, ఆ అప్లికేషన్ ఫాంకు SSC సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు, సంబంధిత కౌన్సిల్‌ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, తహసీల్ధార్ జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం, 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (ప్రైవేటులో చదివిన వారు నివాస ధృవీకరణ పత్రం), దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్ జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను జనవరి 28, 2023 లోపు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయంలో నేరుగా వెళ్లి అందజేయాలి. అప్లికేషన్ ఫాం జనవరి 23, 2023 నుంచి అందుబాటులో ఉంటుంది.
Website : https://kamareddy.telangana.gov.in/
– Jobs in DEIC Banswada
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…