Contract Job

Jobs in Delhi Government Hospitals

Jobs in Delhi Govt Hospitals : ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (ఢిల్లీ/ఎన్సీఆర్/ఝజ్జర్) ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (Broadcast Engineering Consultants India Limited-BECIL) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 15 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

1. Lab Technicians
2. Operation Theatre Assistant
3. MTS (Female)

Lab Technicians

పోస్టుల సంఖ్య : రెండు (02)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో బీ.ఎస్సీ(ఎం ఎల్ టీ) ఉతీర్ణత.
అనుభవం : సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి..
జీతం : రూ.21,970

Operation Theatre Assistant

పోస్టుల సంఖ్య : మూడు (03)
అర్హతలు : బీ.ఎస్సీ లేదా సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. O.T., ICU, CSSD, Manifold Room లలో ఏదైనా ఒకదాంట్లో ఐదు (05) సంవత్సరాల అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన ఆసుపత్రి/ ఇనిస్టిట్యూట్ లో O.T. Techniques లో సర్టిఫికెట్ / డిప్లొమా కోర్సు చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అనుభవం : 500 పడకల ప్రైవేటు, లేదా పబ్లిక్ సెక్టార్ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం : రూ.20,202

MTS (Female)

పోస్టుల సంఖ్య : పది (10)
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
అనుభవం : ఏదైనా ఆసుపత్రిలో కనీసం ఆరు (06) నెలలు పనిచేసి ఉండాలి.
జీతం : రూ.16,614
వయసు : అక్టోబర్ 27, 2022 నాటికి 45 సంవత్సరాలు ఉండాలి.

How to Apply

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా BECIL వెబ్ సైట్ (www.becil.com) లేదా (https://becilregistration.com) ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసి Careers పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి వైపున ఉన్న ఆప్షన్లలో Registration Form (Online Apply) Advt. No. 191 onwards పై క్లిక్ చేయాలి. అందులో New Registration పై క్లిక్ చేయాలి.
Step-1లో application Form ఓపెన్ అవుతుంది. దానిలోని వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత Step-2 లో బేసిక్ డిటేల్స్ ఇవ్వాలి. అనంతరం Step 3లో విద్యార్హతలు, అనుభవానికి సంబం ధించిన వివరాలు నింపాలి. ఆ తర్వాత Step 4లో స్కాన్ చేసిన రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, పుట్టిన తేదీ/ ఎస్సెస్సీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత Step 5లో వివరాలన్నీ చెక్ చేసుకోవాలి. Step 6లో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులు రూ.885, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, దివ్యాంగులు రూ.531 చెల్లించాలి. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలి. అనంతరం అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.
అనంతరం సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతలు, కేటగిరీ, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లికేషన్ ఫాంకు జతచేయాలి. వాటన్నింటినీ సింగిల్ ఫైల్ చేసి అప్లికేషన్ ఐడీ + పేరును ఫైల్ నేమ్ గా ఇవ్వాలి. అనంతరం పీడీఎఫ్ ఫార్మాట్ లో అప్లికేషన్ ఫాంలో సూచించిన  ఈ-మెయిల్ కు మెయిల్ చేయాలి. సబ్జెక్టులో అడ్వటైజ్మెంట్ నెంబర్, పోస్టు పేరు ఇవ్వాలి.
ఏమైనా సందేహాలు గానీ, సహాయం గానీ అవసరం ఉంటే khuswindersingh@becil.com కు మెయిల్ చేయవచ్చు. ఆన్ లైన్ అప్లికేషన్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే sanyogita@becil.com కు మెయిల్ చేయవచ్చు. లేదా 0120-4177860 నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని మాత్రమే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
  • వారికి ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు.
  • అభ్యర్థులు తరచూ మెయిల్ చెక్ చేసుకోవాలి.
  • స్కిల్ టెస్క్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, జాబ్ లో జాయిన్ అయ్యే సమయంలో ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వరు. అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2022

– Jobs in Delhi Govt Hospitals

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago