Jobs in Hanamkonda GMH : తెలంగాణ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య శాఖ (Department of Health and Family Welfare Government of Telangana-CHFW) పరిధిలోని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి (Government Maternity Hospital Hanamkonda) ఆవరణలో గల తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ (Telangana Diagnostics Hub)లో పలు ఉద్యోగాల భర్తీకి హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం తొమ్మిది (09) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లి బయోడేటా ఫాం అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Pathologist
2. Biochemist
3. Microbiologist
4. Radiologist
5. Lab Manager
6. Radiographer
7. Pharmacist
8. Data entry operator
Pathologist
ఉద్యోగం పేరు : పాథాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01) (జిల్లా స్థాయిలో నియమించబడతారు)
అర్హతలు : ఎండీ (పాథాలజీ)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 1,00,000
Biochemist
ఉద్యోగం పేరు : బయోకెమిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (బయోకెమిస్ట్)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 1,00,000
Microbiologist
ఉద్యోగం పేరు : మైక్రోబయాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (మైక్రోబయాలజీ)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 1,00,000
Radiologist
ఉద్యోగం పేరు : రేడియాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (రేడియాలజీ)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 1,00,000
Lab Manager
ఉద్యోగం పేరు : ల్యాబ్ మేనేజర్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 30,000
Radiographer
ఉద్యోగం పేరు : రేడియోగ్రాఫర్
ఉద్యోగాల సంఖ్య : రెండు (02)
అర్హతలు : డిప్లొమా/బీఎస్సీ (రేడియోథెరపీ) డీఎంఎల్టీ /(డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ)
పని/విధులు : కన్సల్టెంట్
జీతం నెలకు : రూ. 30,000
Pharmacist
ఉద్యోగం పేరు : ఫార్మసిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : బీఫార్మసీ లేదా డీ ఫార్మసీ
పని/విధులు : స్థానికులను మరియు కోల్డ్ చెయిన్ మేనేజ్మెంట్ పట్ల శ్రద్ధ వహించుట
జీతం నెలకు : రూ. 17,500
Data entry operator
ఉద్యోగం పేరు : డాటా ఎంట్రీ ఆపరేటర్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : గ్రాడ్యుయేషన్, కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ లో అనుభవం
పని/విధులు : శాంపిల్ స్వీకరణ (శాంపిల్ ఆవశ్యకం) మరియు డేటా తయారీ
జీతం నెలకు : రూ. 15,000
How to Apply
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి బయోడేటా ఫాంను హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి కార్యాలయంలో పని వేళల్లో (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు) అందజేయాలి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ 23 జనవరి, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
Selection Procedure
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) మరియు తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. జనవరి 24, 2023న హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Important Points
- పై ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవి.
- పాథాలజిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఫార్మసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
Important Dates
దరఖాస్తులకు చివరి తేదీ : 23 జనవరి, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ : 24 జనవరి, 2023
ఇంటర్వ్యూలు నిర్వహించు ప్రదేశం : సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండ
– Jobs in Hanamkonda GMH