Contract Job

Consultant Jobs in National Institute of Nutrition

Jobs in ICMR NIN : భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధన విభాగం (Department of Health Research, Ministry of Health and Family Welfare, Government of India)లో హైదరాబాద్​లోని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​(Indian Council of Medical Research – ICMR), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​ (National Institute of Nutrition – NIN)లో ప్రాజెక్ట్​ కన్సల్టెంట్​ (అడ్మినిస్ట్రేషన్​) Project Consultant (Administration), ప్రాజెక్ట్​ కన్సల్టెంట్​ (అకౌంట్స్​) Project Consultant (Accounts) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశారు. మొత్తం మూడు (03) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి క​లిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Details of Posts

1. Project Consultant (Administration) – 02 Posts (Unreserved-UR)
2. Project Consultant (Accounts) – 01 Posts (Unreserved-UR)

Qualification

Project Consultant (Administration) :

ప్రాజెక్ట్​ కన్సల్టెంట్​ (అడ్మినిస్ట్రేషన్​) ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్​ డిగ్రీ పూర్తిచేసి.. అడ్మినిస్ట్రేషన్​లో 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టుకు అడ్మినిస్ట్రేషన్​లో 10 సంవత్సరాల పని అనుభవం రిటైర్డ్​ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Project Consultant (Accounts) :

ప్రాజెక్ట్​ కన్సల్టెంట్​ (అకౌంట్స్​​) ఉద్యోగాలకు కామర్స్​ విభాగంలో బ్యాచిలర్​ డిగ్రీ పూర్తిచేసి.. ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​ లో 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంబీఏ లేదా ఎం.కామ్​ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టుకు ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​​లో 10 సంవత్సరాల పని అనుభవం రిటైర్డ్​ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary

పై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం చెల్లిస్తారు.

Age Limit

ఈ పోస్టులకు 7‌‌0 సంవత్సరాల లోపు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Attend Interview

అర్హులైన, ఆసక్తి క​లిగిన అభ్యర్థులు హైదరాబాద్​లోని ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కు చెందిన వెబ్​సైట్ (https://www.nin.res.in/)​ నుంచి దరఖాస్తు ఫాంను డౌన్​ లోడ్​ చేసుకోవాలి. ముందుగా వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. అందులో Careers పైన క్లిక్​ చేయాలి. అందులో Download Application Form for all posts పై క్లిక్​ చేసి డౌన్​లోడ్​ చేసుకోవాలి. అందులో రీసెంట్​ పాస్ట్​ పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి అన్ని విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన జిరాక్స్​ సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితో పాటు ఒరిజినల్​ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించే రోజు ఉదయం 9:3‌‌0 గంటల నుంచి 11:30 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

Important Points

  • పై పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థి కనీసం ఒక సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది.
  • మధ్యలో మానేస్తే తీసుకున్న జీతం తిరిగి చెల్లించాలి.
  • ఎంపికైన అభ్యర్థులు ICMR నిధులతో “డైట్ అండ్ బయోమార్కర్ సర్వే ఇన్ ఇండియా (DABS-I)” పేరుతో చేపట్టే పాన్ ఇండియా స్టడీకోసం పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎంపికైనవారి వివరాలు ICMR-NIN మరియు ICMR వెబ్‌సైట్లలో పెడతారు.
  • వ్యక్తిగతంగా ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయరు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి టీఏ, టీఏ లాంటివి ఇవ్వరు.
  • అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో హాజరు కావాలి.

Interview Schedule

Date : 20.03.2023
Time : 9:30 AM to 11:30 AM
Venue :
ICMR – NationalInstitute of Nutrition,
Jamai Osmaia Post, Tarnaka,
Hyderabad-500007, Telangana State.

– Jobs in ICMR NIN

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago