Contract Job

Jobs in Kamareddy District

Jobs in Kamareddy District : కామారెడ్డి జిల్లాలో నేషనల్​ హెల్త్​ మిషన్ (National Health Mission-NHM)​లో భాగంగా చేపట్టిన రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమం (Rashtriya Bal Swasthya Karyakram-RBSK) లో ఆయుష్ వైద్య అధికారులు, ఫార్మాసిస్ట్, ఏఎన్​ఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ (RC.No.2115/RBSK/NHM/DM&HO/KMR/2023) వెలువడింది. మొత్తం 11 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్​, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య​ అధికారి కార్యాలయం (District Health and Medical Officer, Kamareddy)లో ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details and Vacancies Of Posts

1. RBSK Medical Officers
2. Pharmacist
3. ANM

RBSK Medical Officers

ఉద్యోగం పేరు : ఆర్​బీఎస్​కే మెడికల్​ ఆఫీసర్​
ఉద్యోగాల సంఖ్య : రెండు (02)
అర్హతలు : 
ఆయుర్వేద: 
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఆయుర్వేదలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
యునాని:
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో యునానిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
హోమియోపతి:
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో హోమియోపతిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
యోగా & నేచురోపతి:
బ్యాచిలర్​ ఆఫ్ నేచురోపతి అండ్​ యోజిక్​ సైన్సెస్​​ (Bachelor of Naturopathy and Yogic Sciences-BNYS)లో డిగ్రీ (లేదా) డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.

Pharmacist

ఉద్యోగం పేరు: ఫార్మాసిస్ట్ ​
ఉద్యోగాల సంఖ్య: ఏడు (07)
అర్హతలు: ఎస్సెస్సీ (SSC) పాసై ఉండాలి. ఫార్మసీలో డిప్లోమా చేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని ఫార్మసీ కౌన్సిల్​లో రిజిస్ట్రేషన్​ చేసుకొని ఉండాలి.

ANM

ఉద్యోగం పేరు: ఏఎన్​ఎం
ఉద్యోగాల సంఖ్య: రెండు (02)
అర్హతలు: ఎస్సెస్సీ (SSC) పాసై ఉండాలి. తెలంగాణ నర్సింగ్ మరియు మిడ్​వైఫ్స్​ కౌన్సిల్ ద్వారా గుర్తించబడిన 18 నెలల MPHW (F) శిక్షణా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా రెండు సంవత్సరాల ఇంటర్మీడియేట్ ఒకేషనల్ MPHW (F) కోర్స్ మరియు ఎంపిక చేయబడిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. వీరు క్లినికల్ ట్రైనింగ్ వెళ్లేందుకు అనుమతించబడతారు.

Age Limit

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.

Selection Procedure

జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

How to Apply

అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లా అధికారి వెబ్​సైట్​ (https://kamareddy.telangana.gov.in/)ను ఓపెన్​ చేయాలి. అందులో RBSK Recruitment notification పై క్లిక్​ చేయాలి. అందులో నిర్ణీత ఫార్మాట్​లో Application Form ఉంటుంది. దానిని డౌన్​లోడ్​ చేసుకోవాలి. అందులో రీసెంట్​ పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.  అలాగే, ఆ అప్లికేషన్​ ఫాంకు SSC సర్టిఫికెట్​, ఇంటర్మీడియట్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు, సంబంధిత కౌన్సిల్‌ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, తహసీల్ధార్ జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం, 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (ప్రైవేటులో చదివిన వారు నివాస ధృవీకరణ పత్రం), దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్​ జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను జనవరి 25, 2023 లోపు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయంలో నేరుగా వెళ్లి అందజేయాలి.

Important Points

  • ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago