Jobs in National Health Mission: తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) ఆధ్వర్వంలో హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న పల్లియేటివ్ కేర్ ప్రోగ్రామ్ (Palliative Care Programme)లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి అర్హులైన మెడికల్ ఆఫీసర్ (Medical Officer), ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist), స్టాఫ్ నర్స్ (Staff Nurse) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Posts & Qualifications
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్ (Medical Officer)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: ఎంబీబీఎస్ (MBBS)
అనుభవం: పెయిన్ రిలీఫ్ తో పల్లియేటివ్ కేర్ లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ జారీ చేసిన పల్లియేటివ్ కేర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.52,000
పోస్టు పేరు: ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: బీపీటీ (Bachelor of Physiotherapy-BPT)
అనుభవం: పెయిన్ రిలీఫ్ తో పల్లియేటివ్ కేర్ లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ జారీ చేసిన పల్లియేటివ్ కేర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.26,000
పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ (Staff Nurse)
పోస్టుల సంఖ్య: ఐదు (05)
అర్హతలు: ఎంఎస్సీ నర్సింగ్ (M.Sc.Nursing) లేదా బీఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) లేదా జీఎన్ఎం (GNM)
అనుభవం: పెయిన్ రిలీఫ్ తో పల్లియేటివ్ కేర్ లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ జారీ చేసిన పల్లియేటివ్ కేర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.29,900
Age Limit
జూలై 1, 2022 నాటికి ఓసీ(OC), బీసీ(BC) (క్రిమీలేయర్) – 44 సంవత్సరాలు.
ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) అండ్ ఈడబ్ల్యూఎస్(EWS) (నాన్ క్రిమీలేయర్) – 49 సంవత్సరాలు.
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ (నాన్ క్రిమీలేయర్)) – 49 సంవత్సరాలు
దివ్యాంగులు – 54 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ (క్రిమీలేయర్)) – 47 సంవత్సరాలు
ఇతర రాష్ట్రాలకు చెందిన అన్ని కేటగిరీల అభ్యర్థులు – 44 సంవత్సరాలు
Selection Criteria
ప్రస్తుత రిక్రూట్ మెంట్ నిబంధనలను అనుసరించి హనుమకొండ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక
చేస్తుంది. విద్యార్హతలు, అనుభవంలో మెరిట్ ఆధారంగా ఎంకిక ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇందులో అభ్యర్థుల విద్యార్హతలకు 40 మార్కులు, అనుభవానికి 50 మార్కులు, వయసుకు 10 మార్కులు కేటాయిస్తారు.
Application Procedure
అర్హులైన అభ్యర్థులు హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్ సైట్ (https://hanumakonda.telangana.gov.in) లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలోని వివరాలను పూర్తిగా నింపాలి. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలి. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి మే 31, 2022 సాయంత్రం 5 గంటలలోపు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
– Jobs in National Health Mission