Contract Job

Jobs in National Insurance Company Limited

Jobs in NICL : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (National Insurance Company Limited-NICL) దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న కంపెనీ శాఖల్లో మెడికల్ ఆఫీసర్స్ (Medical Officers), పారామెడిక్స్ (Paramedics) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Posts Details

1. మెడికల్ ఆఫీసర్స్ (Medical Officers)
2. పారామెడిక్స్ (Paramedics)

Medical Officers

పోస్టుల సంఖ్య: పదమూడు (13)
అర్హతలు: ఎంబీబీఎస్ (MBBS) పూర్తిచేసిన వారు అర్హులు.
అనుభవం: రెండు (02) సంవత్సరాల క్లినికల్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో మూడు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
వయసు: ఆగస్టు 01, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000

Paramedics

పోస్టుల సంఖ్య: ముప్పై ఏడు (37)
అర్హతలు: పారామెడికల్ విద్యార్హతలు/BAMS/BHMS చేసిన వారు అర్హులు.
అనుభవం: హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో మూడు (03) సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
వయసు: ఆగస్టు 01, 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000

Important Points

ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు మూడు (03) సంవత్సరాలపాటు కోల్ కతా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాల్లో ఏదో ఒక
నగరంలో పనిచేయాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు National Insurance Company Limited వెబ్ సైట్ (https://nationalinsurance.nic.co.in/) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి గెజిటెడ్ అధికారి చేత అటెస్టెడ్ చేయించాలి. అలాగే, అందులోని వివరాలన్నీ నింపాలి.
అనంతరం పదో తరగతి నుంచి అన్ని విద్యార్హతలు, ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లను జతచేసి కోల్ కతా లోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి.
ఎనవలప్ కవర్ పైన “Application for Medical Officer / Paramedics on Contractual Basis” అని రాయాలి. అలాగే, అన్ని సర్టిఫికెట్లను స్కాన్ చేసి మెయిల్ చేయాలి.
అసంపూర్తి అప్లికేషన్ ఫాంలను, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేయని అప్లికేషన్ ఫాంలను, ఆఖరు తేదీ తర్వాత పంపించిన అప్లికేషన్ ఫాంలను తిరస్కరిస్తారు. పోస్టల్ జాప్యానికి కంపెనీ బాధ్యత వహించదు.

Selection Procedure

దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కంపెనీ వెబ్ సైట్ లో పెడతారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ/డీఏ లాంటివి ఇవ్వరు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల పేర్లను సైతం వెబ్ సైట్ లో ఉంచుతారు. వ్యక్తిగతంగా తెలియజేయరు. కాబట్టి అభ్యర్థులు తరచూ కంపెనీ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Chief Manager (Personnel)
National Insurance Co LTD,
Head Office, 3 Middleton Street,
Kolkata – 700071
ఈ-మెయిల్ : ho.pers@nic.co.in

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఆగస్టు 12, 2022
– Jobs in NICL

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago