Jobs in NIRDPR : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (National Institute of Rural Development & Panchayatiraj – NIRD&PR) డైరెక్టర్ (ఎంఐఎస్), సీనియర్ పీహెచ్ పీ డెవలపర్, పీహెచ్ పీ డెవలపర్, సీనియర్ పైథాన్ డెవలపర్, కేబీ టెక్ సపోర్ట్ టీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.33/2022) జారీ చేసింది. మొత్తం పదమూడు (13) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Director (MIS)
2. Sr.PHP Developer
3. PHP Developer
4. Sr. Python Developer
5. KB Tech Support Team
Director (MIS)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు : B.Tech (CSE/IT/ECE) లేదా M.Tech (CSE/IT/ECE) లేదా MCA చేసిన వారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు : అక్టోబర్ 27వ 2022 నాటికి 55 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.2,00,000
Sr.PHP Developer
పోస్టుల సంఖ్య : మూడు (03)
అర్హతలు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో నాలుగు (04) సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.75,000
PHP Developer
పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో రెండు (02) సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000
Sr. Python Developer
పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, సంబంవిభాగంలో నాలుగు (04) సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.75,000
KB Tech Support Team
పోస్టుల సంఖ్య : ఐదు (05). UR-04, ) BC-01
అర్హతలు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.40,000
Application Fee
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.300 చెల్లించాలి. ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి. NIRD&PR పేరిట హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యోలా డీడీ తీయాలి. డీడీ వెనక భాగంలో అభ్యర్థి పూర్తిపేరు, అప్లికేషన్ నెంబర్ రాయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ కు చెందిన వెబ్ సైట్ (http://career.nirdpr.in/) ను ఓపెన్ చేయాలి. అందులో Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana – Advt. No.33/2022 dt. 12/10/2022 నోటిఫికేషన్ కింద ఉన్న పోస్టులలో ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తారో ఎంచుకొని దాని పక్కన ఉన్న Register & Apply పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫాంను సబ్మిట్ చేయాలి.
ఆన్ లైన్ దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని, దానికి డీడీని జతచేసి నవంబర్ 03, 2022 లోపు National Institute Of Rural Development & Panchayati Raj, Rajendranagar, Hyderabad – 500 030. చిరునామాకు పంపించాలి.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల పనితీరు, ప్రాజెక్ట్ అవసరాన్నిబట్టి పొడిగించవచ్చు.
- దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు.
- ఈ ఎంపికకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు తరచూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2022
సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాం, డీడీ చేరాల్సిన చివరి తేదీ: నవంబర్ 03, 2022
– Jobs in NIRDPR