Jobs in Sainik School : భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence, Govt. Of India)కు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా కలికిరిలో గల సైనిక్ స్కూల్ (Sainik School, Kalikiri) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం ఐదు (05) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Postgraduate Trained Teachers (PGT) (English) – 01 (UR)
2. Postgraduate Trained Teachers (PGT) (Biology) – 01 (UR)
3. Physical Training Instructor (PTI)-Cum-Matron – 01 (UR)
4. Band Master – 01 (UR)
5. Nursing Assistant – 01 (UR)
Qualifications
PGT (English) :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన సంస్థలో ఇంగ్లిష్ సబ్జెక్టులో బీ.ఈడీ చేసి ఉండాలి. లేదా, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 50 శాతం మార్కులతో ఇంగ్లిష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. NCTE గుర్తింపు పొందిన ఏదైనా సంస్థలో ఇంగ్లిష్ లో B.A.Ed చేసి ఉండాలి.
CBSE అనుబంధ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో రెండు సంవత్సరాలు PGT (English)గా పనిచేసి ఉండాలి.
రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
PGT (Biology) :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బోటనీ/ జువాలజీ/ మైక్రోబయాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/ అగ్రికల్చరల్ బోటనీ/ జెనెటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. M.Sc Botany/ Zology చేసిన వారు గ్రాడ్యుయేషన్ లో బోటనీ మరియు జువాలజీ చదివి ఉండాలి. లేదా, సంబంధిత సబ్జెక్టులో NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc కోర్సు చేసిన వారు అర్హులు.
అలాగే, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీ.ఈడీ చేసి ఉండాలి.
CBSE అనుబంధ స్కూళ్లలో రెండు సంవత్సరాలు బోధన అనుభవం ఉండాలి.
PTI-Cum-Matron :
బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed./BPE) లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బీ.ఎస్సీ చేసి, స్పోర్ట్స్ లో డిగ్రీ చేసిన వారు అర్హులు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఇంగ్లిష్ మీడియంలో బోధించగలగాలి.
జాతీయ/ రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొని ఉండాలి.
Band Master :
మచ్మర్షిలోని AEC ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ లో పొటెన్షియల్ బ్యాండ్/ బ్యాండ్ మేజర్/ డ్రమ్ మేజర్ కోర్సులు చేసిన వారు, లేదా అందుకు సమానమైన నావల్/ ఎయిర్ ఫోర్స్ కోర్సులు చేసిన వారు అర్హులు.
Nursing Assistant :
నర్సింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ (GNM/ B.Sc. (Nursing) చేసిన వారు అర్హులు.
రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
Age Limit
సెప్టెంబర్ 2022 నాటికి PGT (English), PGT (Biology) అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
అలాగే, PTI-Cum-Matron అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు, Band Master అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, Nursing Assistant అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు ఉండాలి.
Salary
PGT (English), PGT (Biology) – రూ.62,356
PTI-Cum-Matron – రూ.58,819
Band Master – రూ.38,252
Nursing Assistant – రూ.33,405
How to Apply
PGT (English), PTI-Cum-Matron, Band Maste పోస్టులకు అభ్యర్థులు కలికిరి సైనిక్ స్కూల్ కు చెందిన వెబ్ సైట్ లింక్ (http://sskalrecruitment.mastersofterp.in.) ను ఓపెన్ చేసి అందులో నిర్ణీత నోటిఫికేషన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
నెల రోజుల లోపు తీయించుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కింద సంతకం చేసి దానిని స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
అలాగే, ఇతర అన్ని విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు.
అర్హులైనవారికి మాత్రమే సమాచారం ఇస్తారు.
అభ్యర్థులు అప్లికేషన్ ఫాంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లనే ఇవ్వాలి.
PGT (Biology), Nursing Assistant పోస్టులకు సెప్టెంబర్ 20, 2022 (మంగళవారం) రోజున ఇంటర్వ్యూలు నిర్వస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు
సెప్టెంబర్ 20, 2022 ఉదయం 9 గంటల లోపు https://forms.gle/N94V5tU9MjkaqWCc6 (PGT Biology), https://forms.gle/ThNCA akx 5kB A3E6S9 (Nursing Assistant) లింక్ ల ద్వారా ఎన్ రోల్ చేసుకోవచ్చు.
ఉదయం 9:30 గంటలకు అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఐడీ ప్రూఫ్, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లతో కలికిరి సైనిక్ స్కూల్ మెయిన్ గేట్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- PTI-Cum-Matron, Nursing Assistant పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఒకవేళ పురుషులు దరఖాస్తు చేసుకొంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు.
అప్లికేషన్ ఫీజు కూడా తిరిగి ఇవ్వరు. - ఆన్ లైన్ దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
- ఈ ఎంపికకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2022
– Jobs in Sainik School