Jobs in Spices Board : భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Commerce & Industry, Govt. of India)కు చెందిన సుగంధ దవ్యాల బోర్డు (Spices Board) ఎగ్జిక్యూటివ్స్ (మార్కెటింగ్), ఎగ్జిక్యూటివ్స్ డెవలప్మెంట్, ట్రేడ్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (ADM/ENGA/05/2022-23 -16) జారీ చేసింది. మొత్తం 20 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Executives (Marketing)
2. Executives (Development)
3. Trade Analyst
Executives (Marketing):
గుంటూరు (ఆంధ్రప్రదేశ్) – 01
నిజామాబాద్ (తెలంగాణ) – 01
గాంగ్టక్ (సిక్కిం) – 01
గుణ స్పైసెస్ పార్క్ (మధ్యప్రదేశ్) – 01
కొచ్చి (కేరళ) – 01
శివగంగ స్పైసెస్ పార్క్ (తమిళనాడు) – 01
గౌహతి (అస్సాం) – 01
ముంబై (మహారాష్ట్ర) – 01
Executives (Development):
కొచ్చి (కేరళ) – 02
బారాబంకి (ఉత్తరప్రదేశ్) – 01
మాంగన్ (సిక్కిం) – 01
ఈటానగర్ (అరుణాచల్ ప్రదేశ్) – 01
నాయకనూర్ (తమిళనాడు) – 01
వరంగల్ (తెలంగాణ) – 01
కంతం (కేరళ) – 01
సుఖిపోక్రి (పశ్చిమ బెంగాల్) – 01
పోండా (గోవా) – 01
ఉనా (హిమాచల్ ప్రదేశ్) – 01
Trade Analyst:
కొచ్చి (కేరళ) – 01
Executives (Marketing) : ఎంబీఏ (మార్కెటింగ్) రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. వ్యవసాయ వస్తువులు/ట్రేడ్ లేదా ఎగుమతి కార్యకలాపాలు/ మౌలిక సదుపాయాల పథకాల అమలు తదితర మార్కెటింగ్ లో రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి.
Executives (Development): బీ.ఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫారెస్త్రీ) లేదా ఎమ్మెస్సీ బోటనీ (జనరల్/ స్పెషలైజేషన్) రెగ్యులర్ కోర్సు చేసిన వారు అర్హులు. అగ్రికల్చర్/ హార్టికల్చర్ అధ్యయన రంగాలలో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి.
Trade Analyst: యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఎకనామిక్స్) రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. మార్కెటింగ్ రిసెర్చ్/ ట్రేడ్ లేదా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్/ డేటా అనాలసిస్ / డిజిటల్ మా ర్కెంటింగ్ ఎఫ్ఎంసీజీ అనుభవంలో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు ఆగస్టు 19, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్థి అనుభవం, విద్యార్హతలను బట్టి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు స్పైసెస్ బోర్డు వెబ్ సైట్ (www.indianspices.com) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి, అందులోని వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, ఐడీ ప్రూఫ్, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ గా మార్చి.. ఆగస్టు 19, 2022 లోపు hrdatp.sb-ker@gov.in మెయిల్ కు పంపించాలి. అలాగే, అప్లికేషన్ హార్డ్ కాపీని ఆగస్టు 26, 2022లోపు కొచ్చిలోని స్పైసెస్ బోర్డు సెక్రెటరీ కార్యాలయానికి పంపించాలి.
అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లనే ఇవ్వాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు వాటికే పంపిస్తారు. అలాగే, తరచూ బోర్డు వెబ్ సైట్ ను సందరించాలి.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
కాంట్రాక్టు వ్యవధి ఒక సంవత్సరం. అభ్యర్థి పనితీరు, స్పైసెస్ బోర్డు అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించవచ్చు.
ఎగ్జిక్యూటివ్స్ (మార్కెటింగ్), ఎగ్జిక్యూటివ్స్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు అభ్యర్థి ఎంచుకున్న స్పైసెస్ బోర్డు కార్యాలయంలో రాత పరీక్ష/ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. ఇంటర్వ్యూ తేదీ, సమయం తర్వాత వెల్లడిస్తారు.
ట్రేడ్ అనలిస్ట్ ఉద్యోగానికి మాత్రం అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
SPICES BOARD
(Ministry of Commerce & Industry, Govt. of
India) . “SugandhaBhavan”,N.H.By Pass,
Palarivattom.P.O, Kochi – 682025,
Kerala, India. – Ph: 0484 2333610
– Jobs in Spices Board
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…