Jobs in Telangana Courts : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3(Stenographer Grade-III), టైపిస్ట్(Typist), కాపీస్ట్(Copyist) ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 324 (స్టెనోగ్రాఫర్-96, టైపిస్ట్-144, కాపీస్ట్-84) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Details of Posts
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (Stenographer Grade-III) :
మొత్తం ఖాళీలు – 96
అర్హతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 టైప్ చేయగలగాలి.
జీతం :
నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
టైపిస్ట్ (Typist) :
మొత్తం ఖాళీలు – 144
అర్హతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 టైప్ చేయగలగాలి.
జీతం :
నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
కాపీస్ట్ (Copyist) :
మొత్తం ఖాళీలు – 84
అర్హతలు :
12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 టైప్ చేయగలగాలి.
జీతం :
నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
Age Limit
పై అన్ని ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
How to Apply
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ హైకోర్టుకు చెందిన వెబ్సైట్ (https://tshc.gov.in) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై నెలలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, ఇతర వివరాలకు హెల్ప్ డెస్క్ నెంబర్ 040 23688394 కు కాల్ చేయవచ్చు. అన్ని వర్కింగ్ డేస్ట్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చు.
జిల్లాలు, కోర్టులు, రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాల వివరాలు
– Jobs in Telangana Courts