Jobs in Telangana Diagnostic Hub : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (Telangana Vaidya Vidhana Parishad-TVVP) పరిధిలోని నర్సంపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Government District Hospital, Narsampet)లో గల తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ (Telangana Diagnostics Hub)లో పలు ఉద్యోగాల భర్తీకి వరంగల్ జిల్లా హెడ్‌క్వార్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పదకొండు (11) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నర్సంపేట, మరియు వరంగల్ జిల్లా హెడ్‌క్వార్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో బయోడేటా ఫాం అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
Pathologist
ఉద్యోగం పేరు : పాథాలజిస్ట్ (Pathologist)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (పాథాలజీ)
జీతం నెలకు : రూ. 1,00,000
Biochemist
ఉద్యోగం పేరు : బయోకెమిస్ట్ (Biochemist)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (బయోకెమిస్ట్)
జీతం నెలకు : రూ. 1,00,000
Microbiologist
ఉద్యోగం పేరు : మైక్రోబయాలజిస్ట్ (Microbiologist)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (మైక్రోబయాలజీ)
జీతం నెలకు : రూ. 1,00,000
Radiologist
ఉద్యోగం పేరు : రేడియాలజిస్ట్ (Radiologist)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (రేడియాలజీ)
జీతం నెలకు : రూ. 1,00,000
Lab Manager
ఉద్యోగం పేరు : ల్యాబ్ మేనేజర్ (Lab Manager)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ)
జీతం నెలకు : రూ. 30,000
Radiographer
ఉద్యోగం పేరు : రేడియోగ్రాఫర్ (Radiographer)
ఉద్యోగాల సంఖ్య : రెండు (02)
అర్హతలు : డిప్లొమా/ బీ.ఎస్సీ (రేడియోగ్రఫీ) DMIT (ఇమేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా)
జీతం నెలకు : రూ. 22,750
Pharmacist
ఉద్యోగం పేరు : ఫార్మసిస్ట్ (Pharmacist)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ
జీతం నెలకు : రూ. 22,750
Gynecologist
ఉద్యోగం పేరు : గైనకాలజిస్ట్ (Gynecologist)
ఉద్యోగాల సంఖ్య : రెండు (02)
అర్హతలు : సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా
జీతం నెలకు : రూ. 1,00,000
Dental Assistant Surgeon
ఉద్యోగం పేరు : డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (Dental Assistant Surgeon)
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ
జీతం నెలకు : రూ. 52,000
How to Apply
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతోపాటు పూర్తి బయోడేటాను జిల్లా ఆసుపత్రి నర్సంపేట్, వరంగల్ జిల్లా హెడ్‌క్వార్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలోపని వేళల్లో (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు) అందజేయాలి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ 17 ఫిబ్రవరి, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
Selection Procedure
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది.
Important Points
- పై ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవి.
- గైనకాలజిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, పాథాలజిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఫార్మసిస్ట్ పోస్టును ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
Important Dates
దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఫిబ్రవరి, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
– Jobs in Telangana Diagnostic Hub