Jobs in TSSPDCL : హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్) (Southern Power Distribution Company of Telanagana Limited-TSSPDCL) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,601 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడదుల చేసింది. ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 48, జూనియర్ లైన్ మెన్ పోస్టులు 1,553 ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (Assistant Engineer/Electrical) :
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) లో ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ లైన్మెన్ (Junior Lineman) :
జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64,295 – రూ.99,345 చెల్లిస్తారు. అలాగే, జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.24,340 – రూ.39,405 చెల్లిస్తారు.
రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్ మెన్ పోస్టులకు రాత పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ : https://www.tssouthernpower.com/
– Jobs in TSSPDCL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…