Jobs in TVVP Hospitals : హైదరాబాద్ జిల్లాలో ప్రోగ్రామ్ ఆఫీసర్ (హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్ స్పెక్షన్స్) (PO(HS&I)) కార్యాలయం పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) (CAS(Specialist)), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 66 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts and Vacancies
CAS(Specialist) :
OB&GY – 11
Anesthesia – 19
Pediatrics – 09
Radiology – 04
General Medicine – 08
Orthopedics – 01
General Surgery – 11
GDMO : 03
Qualifications
MBBS, PG Degree (MD/ Diploma / DNB) చేసిన వారు అర్హులు.
How to Apply
ఆసక్తి కలిగిన, ఆర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాకు చెందిన అధికారిక వెబ్ సైట్ (https://lryderabad.telangana.gov.in/)ను ఓపెన్ చేయాలి. అందులోని Notification for the recruitment of CAS (Specialists) and GDVD oncontract basis at TVVP Hospitals Hyderabad Dist. పై క్లిక్ చేయాలి. అందులో Application of CAS పై క్లిక్ చేయాలి. ఆప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, వివాహితులైతే భర్త/ భార్య పేరు రాయాలి. అలాగే, పుట్టిన తేదీ, కులం, దివ్యాంగులైతే సంబంధిత కేటగిరీ రాయాలి. మాజీ సైనికులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రం జతచేయాలి. అదే విధంగా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాసైన సంవత్సరం. చదివిన జిల్లా రాసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏ జిల్లాకు చెందుతారో రాయాలి.
విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా పాసైన సంవత్సరం చదివిన బోర్డు/ యూనివర్సిటీ పేరు రాయాలి. ఎంబీబీఎస్ లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, ఎండీ/ డిప్లొమా/ డీఎన్బీలలో మొత్తం మార్కులు సాధించిన మార్కులు, పర్సంటేజీ తెలియజేయాలి.
అలాగే, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డీఎన్టీ, పీజీ డిప్లొమా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, తేదీ, కౌన్సిల్ పేరు, వ్యాలిడిటీ తేదీ రాయాలి. అలాగే, చిరునామా కూడా రాసి డిక్లరేషన్ ఫిల్ చేసి సంతకం చేయాలి.
అప్లికేషన్ ఫాంకు అన్ని విద్యార్హతలు సర్టిఫికెట్లతో పాటు కులం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను సెప్టెంబర్ 22, 2022 సాయంత్రం 4 గంటల లోపు అన్ని పనిదినాలలో ఈ కింది చిరునామాలోని కార్యాలయంలో అందజేయాలి.
O/o Programme Officer (HS&I),
Hyderabad, at 4th floor,
Community Health center Khairathabad,
Opposite to ‘Khairathabad Ganesh pandal’
Khairathabad, Hyderabad.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.
ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తారు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు..
- ఎంపికైన అభ్యర్థులు మార్చి 31, 2023 వరకు పనిచేయాల్సి ఉంటుంది.
- ఈ పోస్టులకు Milti Zone-II కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాచేసుకోవాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2022
– Jobs in TVVP Hospitals