Jobs in WDSC HYDA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in WDSC HYD : హైదరాబాద్ లోని వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ (Welfare of Disabled & Senior Citizens Dept-WDSC) లో హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం రెండు (02) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

Details of Posts & Vacancies

1. Help Desk Coordinator – 01
2. Data Entry Operator – 01

Qualifiacations

హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (హ్యుమానిటీ, సోషల్ వర్క్, సైకాలజీ) చేసి ట్రాన్స్ జెండర్స్ సంక్షేమం కోసం పనిచేస్తూ.. ఏదైనా ట్రాన్స్ జెండర్ స్వచ్ఛంద సంస్థ నందు మూడు (03) సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే, కంప్యూటర్ శిక్షణ PGDCA నందు ఉత్తీర్ణులై ఉండాలి.

Salary

హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ : నెలకు రూ.50,000
డేటా ఎంట్రీ ఆపరేటర్ : నెలకు రూ.26,749

Age Limit

హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు ఉద్యోగాలకు కూడా అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల
మధ్య ఉండాలి.

How to Apply

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన వెబ్ సైట్ (www.wdsc.Telangana.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Notification for fill up the posts of Home Coordinator and Data Entry Operator under Help Desk for Transgender persons-2022 (12/12) పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ తో పాటు నిర్ణీత ఫార్మాట్ లో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ నైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను నవంబర్ 30, 2022 సాయంత్రం 5 గంటలలోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
Office of the Director,
Welfare of Disabled & Senior Citizens Dept.
Malakpet, Nalgonda X Roads, Hyderabad.
దరఖాస్తులు పోస్టు ద్వారా పంపించవచ్చు. లేదా నేరుగా వెళ్లి కూడా అందజేయవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. పూర్తి సమాచారం కోసం 040-24559048 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పనిచేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల పనితీరును బట్టి పొడిగించవచ్చు.
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 30, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)

Website: www.wdsc.Telangana.gov.in

– Jobs in WDSC HYD