Junior Assistant Jobs in NPDCL : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Northern Power Distribution Company of Telangana Ltd-TSNPDCL) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (Junior Assistant – Cum – Computer Operator) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.01/2023) జారీ చేసింది. మొత్తం 100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 95 శాతం పోస్టులను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల అభ్యర్థులకు, 5 శాతం పోస్టులను ఇతరులకు కేటాయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబుబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి.
Qualifications
అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థలో బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే, కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit
జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (SC/ST/BC/EWS) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Scale of Pay
రూ.29,255-910-33,805-1,120–39,405-1,355-46,180–1,640-54,380
Application and Examination Fee
ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు. ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.
Application Procedure
అర్హులైన అభ్యర్థులు ముందుగా TSNPDCL వెబ్ సైట్ (http://tsnpdcl.cgg.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Make Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్ సైట్ లో Submit Application ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10, 2023 నుంచి ప్రారంభం అవుతుంది.
Scheme of Exam
- రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- సెక్షన్-ఏ, సెక్షన్-బీ, సెక్షన్-సీ మూడు విభాగాలలో పరీక్ష ఉంటుంది.
- సెక్షన్-ఏలో న్యుమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.
- సెక్షన్-బీలో కంప్యూటర్ అవేర్ నెస్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
- సెక్షన్-సీలో ఇంగ్లిష్ లాంగ్యేజ్ ప్రొఫిషియెన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
- రెండు గంటలలో పరీక్ష రాయాలి. ఒక్క జవాబుకు ఒక మార్కు ఉంటుంది.
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో పరీక్ష నిర్వహిస్తారు.
- క్వాలిఫై మార్కులు ఓసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం రావాలి.
అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే సమయంలో గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ డెస్క్ నెంబర్ (0870-2461030)కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. అలాగే, టీఎస్ ఎన్పీడీసీఎల్ వెబ్ సైట్ (http://tsnpdcl.cgg.gov.in)లోని complaint box పై క్లిక్ చేసి కూడా సమస్యకు పరిష్కారం పొందవచ్చు.
Important Dates
ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 10, 2023
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2023 (రాత్రి 11:59 వరకు)
ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ : మే 02, 2023 నుంచి మే 05, 2023 వరకు
హాల్ టికెట్లు డౌన్ లోడ్: మే 22, 2023
రాత పరీక్ష : మే 28, 2023 (ఆదివారం)
– Junior Assistant Jobs in NPDCL