Social Security Assistant JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Social Security Assistant Jobs : ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization-EPFO)​ దేశ వ్యాప్తంగా రీజియన్ల వారీగా రెగ్యులర్​ ప్రాతిపదికన సోషల్​ సెక్యూరిటీ అసిస్టెంట్​ (Social Security Assistant (Group-C)) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,674 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రీజియన్​లో 116 పోస్టులు, ఆంధ్రపద్రేశ్​ రీజియన్​లో 39 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామినేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies

తెలంగాణ రీజియన్​ ‌‌– 116
ఎస్సీ–20, ఎస్టీ–06,ఓబీసీ –36,ఈడబ్ల్యూఎస్​–33, అన్​రిజర్వుడ్​–21

ఆంధ్రప్రదేశ్​ రీజియన్​ ‌‌- 39 పోస్టులు
ఎస్సీ–08, ఓబీసీ – 07, ఈడబ్ల్యూఎస్​–19, అన్​రిజర్వుడ్​–05

Qualifications

ఏదైనా విభాగంలో బ్యాచిలర్​ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే, కంప్యూటర్​లో నిమిషానికి 35 ఇంగ్లిష్​ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్​ చేయగలగాలి.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.29,900 ‌‌ – రూ.92,300 వరకు చెల్లిస్తారు.

Age Limit

దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

 Selection Procedure

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామినేషన్​, కంప్యూటర్​ టైపింగ్​ టెస్ట్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Written Test

రాత పరీక్ష రెండు ఫేజ్​లలో ఉంటుంది. ఫస్ట్​ ఫేజ్​లో కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామినేషన్​ ఉంటుంది. ఫేజ్​‌-2లో కంప్యూటర్​ టైపింగ్​ టెస్ట్​ (కంప్యూటర్​ డాటా ఎంట్రీ టెస్ట్​) ఉంటుంది. కంప్యూటర్​ బేస్డ్ రాత పరీక్ష అబ్జెక్టివ్​ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 600 మార్కులు ఉంటాయి. ఒక్కో జవాబుకు నాలుగు మార్కులు ఇస్తారు. జనరల్​ అప్టిట్యూడ్​ నుంచి 30 ప్రశ్నలు, జనరల్​ నాలెడ్జ్​/ జనరల్​ అవేర్​నెస్​ నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ​ నుంచి 30 ప్రశ్నలు, జనరల్​ ఇంగ్లిష్​ నుంచి 50 ప్రశ్నలు, కంప్యూటర్​ లిటరసీ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష రెండున్నర గంటలలో రాయాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తి క​లిగిన అర్హులైన అభ్యర్థులు https://recruitment.nta.nic.in వెబ్​ సైట్​ నుంచి ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నాలుగు స్టెప్​లలో ఉంటుంది. ఫస్ట్​ స్టెప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. సెకండ్​ స్టెప్​లో అప్లికేషన్​ ఫాం నింపాలి. థర్డ్​ స్టెప్​లో ఫొటో, సంతకం, థంబ్​ ఇంప్రెషన్​ స్కాన్​చేసి అప్​లోడ్​ చేయాలి. ఫోర్త్​ స్టెప్​లో అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు  అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నెట్​ బ్యాంకింగ్​, డెబిట్​ కార్డు, క్రెడిట్​ కార్డు, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.03.2023
దరఖాస్తులకు చివరి తేదీ : 26.04.2023
వెబ్​ సైట్​లు : http://recruitment.nta.nic.in, www.epfindia.gov.in
నోటిఫికేషన్​ లింక్​ : https://www.epfindia.gov.in/site_en/Recruitments.php

– Social Security Assistant Jobs