Junior Nurse Jobs in JIPMER : పుదుచ్చేరి(Puducherry)లోని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(Jawaharlal Institute of Postgraduate Medical Education & Research-JIPMER)లో ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జూనియర్ నర్స్ / ఫీల్డ్ అసిస్టెంట్ (Junior Nurse / Field assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ–మెయిల్ ఐడీకి సర్టిఫికెట్లు పంపించి దరఖాస్తు చేసుకోవచ్చు.
Name of the Post
1. Junior Nurse/ Filed assistant
Qualification
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో బీ.ఎస్సీ(నర్సింగ్) (B.Sc(Nursing)) లేదా ఎమ్మెస్సీ(నర్సింగ్) (M.Sc(Nursing)) లేదా ఏఎన్ఎం(ANM), లేదా ఎంఎల్టీ (MLT) చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అలాగే, ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
ANC Mothers, న్యూట్రిషన్ సంబంధిత ప్రాజెక్ట్‌లు, రక్త నమూనాలను ఆల్కట్ చేయడం, కమ్యూనిటీ-స్థాయి ఫీల్డ్ వర్క్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎ స్టీ, ఓబీసీ అభ్యర్థులకు రెండు (02) సంవత్సరాల సడలింపు ఉంటుంది.
Salary
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 ల జీతం చెల్లిస్తారు. అలాగే, ట్రావెల్ అలవెన్సులు ఇస్తారు. రెండో సంవత్సరం అభ్యర్థి పనితీరును బట్టి 10 శాతం జీతం పెంచుతారు.
How to Apply
అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు JIPMER వెబ్సైట్లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి సీవీ(CV), రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో (Colour photograph), డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్(Proof for date of birth), రెసిడెన్స్ సర్టిఫికెట్ (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) (Proof of residence – Adhar card, Driving licence) విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, అనుభవంనకు సంబంధించిన సర్టఫికెట్లు (Qualification and experience certificates) స్కాన్ చేసి జతచేయాలి. ఈ మొత్తం సర్టిఫికెట్లను మార్చి 02, 2023, సాయంత్రం 4:30 గంటల లోపు [email protected] మరియు [email protected] కు పంపించాలి. సబ్జెక్ట్‌లో “Application for Junior Nurse (GPS – GDM Prevention Study)” అని పెట్టాలి. సీవీలో ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ క్లియర్‌గా రాయాలి.
Selection Process
దరఖాస్తుల పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అందులో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఈ–మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
Importanat Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కేవలం రెండు పోస్టులు మాత్రమే కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
- ముందుగా ఒక సంవత్సరానికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత పొడిగిస్తారు.
- ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి పుదుచ్చేరిలోని పీహెచ్‌సీలను సందర్శించాల్సి ఉంటుంది.
- ఏఎన్సీ తల్లుల జాబితా సేకరించాలి. వారికి డైట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.
- అవసరాన్ని బట్టి బ్లడ్ సాంపిల్స్ సేకరించాలి.
Importanat Dates
దరఖాస్తుకు చివరి తేదీ : 02-03-2023
షార్ట్‌లిస్ట్ ప్రచురించు తేదీ : 06-03-2023 (JIPMER వెబ్సైట్ లో)
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 10-03-2023
జాబ్‌లో చేరే తేదీ : 14-03-2023న లేదా అంతకు ముందు
Website : https://jipmer.edu.in/
– Junior Nurse Jobs in JIPMER