Master of Fine Arts Admissions : హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Jawaharlal Nehru Architecture and Fine Arts University-JNAFAU) 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెండు సంవత్సరాల (2 years) మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (Master of Fine Arts-MFA) ఫుల్ టైం-సెల్ఫ్ ఫైనాన్స్ (Full Time-Self finance) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ (JNAFA U/Adms/MFA-2022/1) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష (Entrance Examination), ఇంటర్వ్యూ (Interview) ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1. MFA (Applied Art & Visual Communication)
2. MFA (Painting & Visual Communication)
3. MFA (Photography & Media Communication)
4. MFA (Sculpture)
కోర్సు పేరు: ఎంఎఫ్ఎ (అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్)
సీట్ల సంఖ్య: ఇరవై (20)
అర్హతలు: నాలుగు సంవత్సరాల (4 years) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లైడ్ ఆర్ట్) B.F.A (Applied Art) చేసిన వారు అర్హులు.
కోర్సు వ్యవధి: రెండు (02) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఏడాదికి రూ.75,000
కోర్సు పేరు: ఎంఎఫ్ఎ (పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్)
సీట్ల సంఖ్య: పదిహేను (15)
అర్హతలు: నాలుగు సంవత్సరాల (4 years) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్) B.F.A (Painting) చేసిన వారు అర్హులు.
కోర్సు వ్యవధి: రెండు (02) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఏడాదికి రూ.75,000
కోర్సు పేరు: ఎంఎఫ్ఎ (ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్)
సీట్ల సంఖ్య: పదిహేను (15)
అర్హతలు: నాలుగు సంవత్సరాల (4 years) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోగ్రఫీ) B.F.A (Photography) చేసిన వారు అర్హులు. మూడు సంవత్సరాల (3 years) B.F.A (Photography) చేసిన తర్వాత ఫొటోగ్రఫీలో మూడు సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారు కూడా అర్హులే.
కోర్సు వ్యవధి: రెండు (02) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఏడాదికి రూ.75,000
కోర్సు పేరు: ఎంఎఫ్ఎ (స్కల్ప్చర్)
సీట్ల సంఖ్య: ఆరు (06)
అర్హతలు: నాలుగు సంవత్సరాల (4 years) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్కల్ప్చర్) B.F.A (Sculpture) చేసిన వారు అర్హులు.
కోర్సు వ్యవధి: రెండు (02) సంవత్సరాలు
ట్యూషన్ ఫీజు: ఏడాదికి రూ.75,000
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా హైదరాబాద్ లోని ఏదైనా జాతీయ బ్యాంకులో చెల్లుబాటు అయ్యేలా Registrar, JNAFAU పేరిట రూ.2వేలు డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1000 డీడీ తీయాలి. ఆ తర్వాత JNAFAU వెబ్ సైట్ (www.jnafau.ac.in.) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అప్లికేషన్ ఫాంకు ఈ క్రింది సర్టిఫికెట్లు జత చేయాలి.
1. విద్యార్హతల (బీఎఫ్ఎ) సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు (గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించాలి)
2. పదో తరగతి మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
4. కులం సర్టిఫికెట్ (2014 తర్వాత జారీ చేసినది. ఎస్సీ/ఎస్టీ/బీసీఅభ్యర్థులు మాత్రమే)
5. ఆదాయం సర్టిఫికెట్ (జనవరి 1, 2022 తర్వాత జారీ చేసినది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం)
7. నివాస ధ్రువీకరణ పత్రం (NIS అభ్యర్థులు మాత్రమే)
8. బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి డిగ్రీ వరకు)
9. డిగ్రీ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
10. ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (3 years B.F.A (Photography) అభ్యర్థులు మాత్రమే)
11. డిపార్ట్ మెంట్/ ఆర్గనైజేషన్ హెడ్ ద్వారా ధ్రువీకరించబడిన ఐదు (05) పనుల ఫొటోలు (MFA (Sculpture) అభ్యర్థులు మాత్రమే). ఒక్కో పనికి సంబంధించి రెండు ఫొటోలు, 5X7 సైజ్ లో ఉండాలి.
పై అన్ని సర్టిఫికెట్లు, డీడీ, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు Director, Admissions, Jawaharlal Nehru Architecture and Fine Arts University, Masab Tank, Hyderabad-500028 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 23, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
వివరాల కోసం 040-23319462/8074700647 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఈ-మెయిల్ : admissions@jnafau.ac.in.
వెబ్ సైట్ : www.jnafau.ac.in.
– Master of Fine Arts Admissions
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…