MBBS BDS Admissions : తెలంగాణ రాష్ట్రం.. వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of Health Sciences-KNRUHS) అనుబంధ మెడికల్ మరియు డెంటల్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ (MBBS and BDS) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. National Eligibility-cum- Entrance Test (NEET) UG-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
NEET-UG-2022లో అభ్యర్థులు కటాఫ్ స్కోర్ ఈ కింది విధంగా లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి.
General Category including EWS
Qualifying Criteria : 50th Percentile
Cut off score : 117
SC/ST/BC & PWD Category :
Qualifying Criteria : 40th Percentile
Cut off score : 93
Persons with Disability (OC):
Qualifying Criteria : 45th Percentile
Cut off score : 105
అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ కోర్సులలో చేరదలుచుకొనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులు రూ.3,500, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు రూ.2,900 చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు https://tspgmed.tsche.in వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి. అందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను పూరించి సబ్మిట్ చేయాలి. అలాగే, ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. NEET-UG-2022 ర్యాంక్ కార్డు
2. ఎస్సెస్సీ మెమో
3. ఇంటర్మీడియట్ మెమో
4. స్టడీ సర్టిఫికెట్లు (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
6. ఇటీవల తీసుకొన్న కులం సర్టిఫికెట్
7. మైనారిటీ సర్టిఫికెట్ (మైనారిటీ అభ్యర్థులు మాత్రమే)
8. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే)
9. ఇటీవల తీసుకొన్న ఆదాయం సర్టిఫికెట్
10. ఎన్సీసీ సర్టిఫికెట్ (ఎన్సీసీ కేడెట్స్ మాత్రమే)
11. ఆధార్ కార్డు
12. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
13. సంతకం.
పై అన్ని సర్టిఫికెట్లు పీడీఎఫ్ ఫార్మాట్ లో 500 కేబీ సైజ్ లో, ఫొటో, సంతకం జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో 100 కేబీ సైజ్ లో అప్ లోడ్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
సీటు పొందిన తర్వాత సంబంధిత కళాశాలలో అప్లికేషన్ ఫాంతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఒక నెట్ జిరాక్స్ కాపీలు
అందజేయాల్సి ఉంటుంది.
దివ్యాంగులు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే మెడికల్ బోర్డు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
MBBS BDS Admissions కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో సబ్మిట్ చేసిన దరఖాస్తులోని వివరాలు, అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ తేదీలను ప్రకటిస్తారు. అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు ఈ కింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
సాంకేతిక సహాయం కోసం :
ఫోన్ నెంబర్లు 9392685856, 7842542216, 9059672216
ఈ-మెయిల్ : tsmedadm2022@gmail.com
నిబంధనలపై వివరణ కోసం :
ఫోన్ నెంబర్లు : 9490585796, 8500646769
పేమెంట్ సమస్యల పరిష్కారం కోసం : 9959101577
ఇతర సమస్యల పరిష్కారం కోసం :
knrpgadmission2022@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
పై ఫోన్ నెంబర్లకు ఆఫీసు సమయాల్లో మాత్రమే (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ఫోన్ చేయాలి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల అప్ లోడ్ కు చివరి తేదీ : అక్టోబర్ 18, 2022 (సాయంత్రం 6 గంటల వరకు)
– MBBS BDS Admissions
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…