MDHM Course in Apollo : హైదరాబాద్ లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (Apollo Institute of Hospital Administration-AIHA) మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (Master’s Degree in Hospital Management-MDHM) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టోరేట్ అఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించే ప్రవేశ పరీక్ష (Entrance Test-2022)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తారు. స్థానిక అభ్యర్థులందరికీ సీట్లు కేటాయించిన తర్వాత ఇంకా సీట్లు మిగిలి ఉంటే ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు.
ఫైన్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్ మినహా కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (మెడికల్, నాన్ మెడికల్)లో పాసై ఉండాలి. రిజర్వేషన్ క్యాటగిరీలకు చెందిన వారు 45 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ సమయానికి విద్యార్హత సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది.
మొత్తం సీట్లు 60 ఉంటాయి. ఇందులో 30 శాతం మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. 85 శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం సీట్లు ఓపెన్ కోటా. ఇందులో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. బోధన మరియు పరీక్షలు ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటాయి. ఇది ఫుల్ టైం కోర్సు. ఎంపికైన అభ్యర్థులకు 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి.
కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. క్లాస్ రూమ్ తరగతులు, వైద్యరంగంలోని నిపుణులతో తరగతులు ఉంటాయి. కేస్ స్టడీస్, ఫీల్డ్ విజిట్, ప్రాజెక్టు వర్క్, ఆడియో విజువల్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్లు, సెమినార్లు, సమ్మర్ ప్రాజెక్టులు, పరిశోధనలు, ఇంటర్న్ షిప్ ఉంటాయి.
కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.60,000 మరియు కౌన్సెలింగ్ ఫీజులు ఉస్మానియా యూనివర్సిటీలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, స్పెషల్ ఫీజులు, విద్యార్థులు సాధారణ సేవలు, ఇన్సూరెన్స్, డ్రెస్ నిమిత్తం కాలేజీలో రూ.20 వేలు చెల్లించాలి. రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ ప్రారంభం అయిన తర్వాత ట్యూషన్ ఫీజు రూ.60,000, స్పెషల్ ఫీజులు రూ.3,000 కాలేజీలో చెల్లించాల్సి ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు జూబ్లీహిల్స్ అపోలో హెల్త్ సిటీలో గల అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో రూ.1200 చెల్లించి అప్లికేషన్ ఫాం, ఐసీఆర్ ఫాంలను తీసుకోవచ్చు. లేదా ‘The Principal, AIHA’ పేరిట హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యేలా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. జనరల్, బీసీ (Backward Classes) అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 డీడీ తీయాలి. ఆ తర్వాత ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ (http://www.apolloiha.ac.in.) నుంచి అప్లికేషన్ ఫాం, ఐసీఆర్ ఫాంలను డౌన్ లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, డీడీ జతచేసి జూన్ 27, 2022లోపు అపోలో ఇనిస్టిట్యూట్ అఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయాలి.
హాల్ టికెట్లు అభ్యర్థులకు పంపించబడవు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ లో పెడతారు. అభ్యర్థులు కళాశాలకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షకు మూడు రోజుల ముందు హాల్ టికెట్లు ఇస్తారు. కళాశాలలో హాల్ టికెట్ తీసుకోలేకపోయిన అభ్యర్థులు గంట ముందు ప్రవేశ పరీక్ష కేంద్రానికి వెళ్లికూడా తీసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. 90 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఏలో రీజనింగ్, సెక్షన్-బీలో న్యుమరికల్ ఎబిలిటీ, సెక్షన్-సీలో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ యూసేజ్, సెక్షన్-డీలో హెల్త్ అండ్ హాస్పిటల్ నాలెడ్జ్, సెక్షన్-ఈలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (Master’s Degree in Hospital Management – MDHM) కోర్సును అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (AIHA) అందిస్తోంది. AIHA 1994లో స్థాపించబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది. All India Council for Technical Education (AICTE)చే ఆమోదించబడింది. ఇందులో శిక్షణ పొందిందిన వారికి కార్పొరేట్ హాస్పిటల్స్, బీమా కంపెనీలు, NGOలు, హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్లలో మంచి అవకాశాలు లభిస్తాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: 27 జూన్, 2022
రూ.500 ఆలస్య రుసుముతో: 05 జూలై, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: 21 జూలై, 2022
ఫలితాలు ప్రకటించే తేదీ: 28 జూలై, 2022 లోపు
కౌన్సెలింగ్ తేదీ: 12 ఆగస్టు, 2022
తరగతులు ప్రారంభం: 22 ఆగస్టు, 2022
కళాశాల చిరునామా:
The Principal,
Apollo Institute of Hospital Administration,
Apollo Health City, Jubilee Hills, Hyderabad- 500 096.
ఫోన్ నెంబర్: 040-23543269, 23556850
ఈ-మెయిల్: info@apolloiah.ac.in
– MDHM Course in Apollo
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…