Medical Officer Jobs in NHMA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Medical Officer Jobs in NHM : రంగారెడ్డి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) ప్రోగ్రాంలో కొనసాగుతున్న బస్తీ దవాఖానాల్లో (Basthi Dawakana) మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి రంగారెడ్డి జిల్లా మెడికల్​ అండ్​ హెల్త్​ ఆఫీసర్​ కార్యాలయం నోటిఫికేషన్ (RC.No.5680/E1E6/DMHO/RR/2023) జారీ చేసింది. మొత్తం 49 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

1. Medical Officer – 49

Remuneration

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.రూ.52,000 జీతం చెల్లిస్తారు.

Eligibility

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జులై 01, 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Application Fee

ఓసీ మరియు బీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నిమిత్తం రూ.500 చెల్లించాలి. ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి. District Medical & Health Officer, Rangareddy పేరిట డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://rangareddy.telangana.gov.in/)లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.

అప్లికేషన్ ఫాంకు ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి (SSC) మెమో
2. ఇంటర్మీడియట్ మెమో
3. ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు
4. అన్ని అర్హత పరీక్షల మార్కుల మెమోలు
5. ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు
6. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
7. కులం సర్టిఫికెట్
8. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (ప్రైవేటులో చదివిన వారు రెసిడెన్స్ సర్టిఫికెట్)
9. దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్
10. మాజీ సైనికులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
11. అక్నాలెడ్జ్ మెంట్ కార్డ్
12. డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్)
ఆ మొత్తం సర్టిఫికెట్లను ఫిబ్రవరి 15, 2023 సాయంత్రం 5 గంటలలోపు రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. జిల్లా కలెక్టర్​ నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
కార్యాలయం చిరునామా :
O/o District Medical & Health Officer,
Ranga Reddy District,
Near Pillar No.294 of PVNR Express Way,
Manikanta Colony, Shivarampally,
Rajendra Nagar,
Ranga Reddy District.

పూర్తి వివరాలకు https://rangareddy.telangana.gov.in/ వెబ్​సైట్​ను సంప్రదించవచ్చు.

Importanat Points

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి పనితీరును బట్టి పొడిగించవచ్చు.

Medical Officer Jobs in Kamareddy

కామారెడ్డి జిల్లాలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని విభాగాల్లో మెడికల్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేశారు. మెడికల్​ ఆఫీసర్​ (ఆయుర్వేద)‌ – ఎనిమిది (08) , మెడికల్​ ఆఫీసర్​ (యునాని) – రెండు (02) , మెడికల్​ ఆఫీసర్​ (హోమియోపతి) ‌– ఆరు (06) పోస్టులు భర్తీ చేయనున్నారు.

మెడికల్​ ఆఫీసర్​ (ఆయుర్వేద) పోస్టులకు బీఏఎంఎస్​(BAMS), మెడికల్​ ఆఫీసర్​ (యునాని) పోస్టులకు బీయూ​ఎంస్​(BUMS), మెడికల్​ ఆఫీసర్​ (హోమియోపతి) పోస్టులకు బీహెచ్​ఎంఎస్​ ​(BHMS) చేసి ఉండాలి. అలాగే, బోర్డ్​ ఆఫ్​ ఇండియన్​ మెడిసిన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకొని ఉండాలి.

ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://kamareddy.telangana.gov.in/)లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవం నకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేసి ఫిబ్రవరి 20, 2023 సాయంత్రం 5 గంటలలోపు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.

పూర్తి వివరాలకు https://kamareddy.telangana.gov.in/ వెబ్​సైట్​ను సంప్రదించవచ్చు.

Medical Officer in Palliative Care Programme

కామారెడ్డి జిల్లా మెడికల్​ అండ్​ హెల్త్​ ఆఫీసర్ నియంత్రణలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పాలియేటివ్​ కేర్​ ప్రోగ్రాం (Palliative Care Programme)లో మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ (RC.No.1281/E1/DM&HO/KMR/2023) వెలువడింది. ఎంబీబీఎస్ చేసిన వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ లోపు కామారెడ్డి జిల్లా మెడికల్​ అండ్​ హెల్త్​ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్​, ఎంసీఐ రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​, ఇంటర్న్​షిప్​ సర్టిఫికెట్​, అన్ని మార్కుల మెమోలు, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కులం సర్టిఫికెట్​, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు జత చేయాలి.

ఈ ఉద్యోగం కూడా పూర్తిగా తాత్కాలికమైనది. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థి ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.

– Medical Officer Jobs in NHM