Medical officer Jobs in Nims : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMSNIMS) ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Rc.No.HR1/260/2022/R) జారీ చేసింది. మొత్తం ఎనిమిది (08) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Posts & Vacancies
మెడికల్ ఆఫీసర్ (Medical Officer) – 08
Qualification
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో ఎంబీబీఎస్(MBBS) ఉత్తీర్ణులైనవారు అర్హులు. రీసస్క్టియేషన్ ఇంట్యూబేషన్(Resuscitation Intubation), రోగ నిర్ధారణ(Diagnosis), అత్యవసర కేసులకు చికిత్స చేయడం (Treating Emergency Cases), ఈసీజీ చదవడం (Reading ECG), ట్రాకియోటమీ (Tracheotomy), కుట్లు వేయడం మరియు ఎం ఎల్ సీ కేసులను నిర్వహించడంలో పరిజ్ఞానం (Suturing and knowledge in MLC Cases) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Age Limit
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
Salary
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.50,000 జీతం చెల్లిస్తారు.
Registration Fee
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిమ్స్ లోని క్యాష్ కౌంటర్ లో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిసిప్ట్ తీసుకోవాలి.
How to Attend Interview
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమ వైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Medical Officers for Emergency Department పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్
అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి ఎస్సెస్సీ మెమో, ఎంబీబీఎస్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్, ఎంసీఐ రికగ్నైజేషన్ స్టాటస్ సర్టిఫికెట్, పర్మినెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ప్రొవిజినల్ లేదా ఫైనల్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే) అనుభవం ఉన్నట్టయితే ఆ సర్టిఫికెట్, ఫర్ఫార్మెన్స్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ ఫీజు రిసిప్ట్ జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
Interview date and time
అక్టోబర్ 12, 2022 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
Data Entry Operator
నిమ్స్ కంట్రోల్ లో కొనసాగుతున్న టెలీ రేడియాలజీ హబ్స్ ఫర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ (Tele -Radiology HUBs for Telangana Diagnostics) లో డాటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పనిలో అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి డాటా ఎంట్రీ విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు. జీతం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమవైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Data Entry Operator on Temporary Post పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఈ కింది అడ్రస్ కు పోస్టు ద్వారా గానీ, నేరుగా వెళ్లి గానీ అక్టోబర్ 11, 2022 సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలి.
The Dean,
Nizam’s Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad – 500082, TS.
Importanat Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
- దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూకు అలాగే, జాయినింగ్ కోసం వచ్చే సమయంలో టీఏ, డీఏలాంటివి ఇవ్వరు.
- అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.
– Medical officer Jobs in Nims