Medical Officer Physiotherapist Jobs : నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM) విభాగంలో ఆయుష్ డిస్పెన్సరీలలో మెడికల్ ఆఫీసర్ (ఆయుష్/యునాని/హోమియోపతి/నాచురోపతి), పోస్టులు, పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ జాతీయ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి నిజామాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Medical Officer (Ayush)
2. Medical Officer (Unani)
3. Medical Officer (Homeopayhy)
4. Medical Officer (Naturopathy)
5. Physiotherapist
ఇందులో మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) – 13 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ (యునాని) – 04 , మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) – 04, మెడికల్ ఆఫీసర్ (నాచురోపతి) – 01 పోస్టు, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు – 02 ఉన్నాయి. ఫిజియోథెరపిస్ట్ పోస్టులను పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం (Palliative Care Programme)లో ఒకటి, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ జాతీయ కార్యక్రమం (National Programme for Health Care of Elderly)లో ఒకటి భర్తీ చేస్తారు.
Eligibility
- మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) : బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చేసి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ (యునాని) : బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS) చేసి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) : బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) చేసి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ (నేచురోపతి) : బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (BNYS) చేసి ఉండాలి.
అలాగే, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. - ఫిజియోథెరపిస్ట్ : బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT) చేసి ఉండాలి. అలాగే, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Remuneration
మెడికల్ ఆఫీసర్ (ఆయుష్/యునాని/హోమియోపతి/నేచురోపతి) ఉద్యోగాలకు నెలకు రూ.35,000, ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు రూ.26,000 జీతం చెల్లిస్తారు.
Age Limit
ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://nizamabad.telangana.gov.in/)లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంలను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. మెడికల్ ఆఫీసర్ (ఆయుష్/యునాని/హోమియోపతి/నేచురోపతి) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎస్సెస్సీ, BAMS/BUMS/BHMS/BNYS సర్టిఫికెట్లు, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, బోనఫైడ్, కులం సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రెండు రీసెంట్ పాస్ సైజ్ ఫొటోలు జత చేయాలి. ఈ మొత్తం సర్టిఫికెట్లను ఫిబ్రవరి 20, 2023, సాయంత్రం 5 గంటల లోపు అన్ని వర్కింగ్ డేస్లో నిజామాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో (రూమ్ నెం.201, IDOC) అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ఫిజియోథెరపీ పోస్టుకు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, బోనఫైడ్, సర్టిఫికెట్, రెండు రీసెంట్ పాస్ సైజ్ ఫొటోలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్లాలి. ఫిబ్రవరి 17, 2023, ఉదయం 11 గంటల నుంచి నిజామాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో, రూమ్ నెం.201లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Importanat Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
పూర్తి వివరాలకు నిజామాబాద్ జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://nizamabad.telangana.gov.in/)ను చూడవచ్చు.
– Medical Officer Physiotherapist Jobs