Medical Officer Staff Nurse Jobs : వరంగల్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్తీ దవాఖానాల్లో (Basthi Dawakana) మెడికల్ ఆఫీసర్ (Medical Officer), స్టాఫ్ నర్స్ (Staff Nurse), సపోర్టింగ్ స్టాఫ్ (Supporting Staff) పోస్టుల భర్తీకి వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (District Medical and Health Officer) నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం తొమ్మిది (09) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, అభ్యర్థుల వయసు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Medical Officer – 03
2. Staff Nurse – 03
3. Supporting Staff – 03
Medical Officer – రూ.52.000 (నెలకు)
Staff Nurse – రూ.29,900 (నెలకు)
Supporting Staff – రూ.10,000 (నెలకు)
మెడికల్ ఆఫీసర్ : మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు ఎంబీబీఎస్ (Bachelor of Medicine, Bachelor of Surgery-MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (Telangana State Medical Council) లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
స్టాఫ్ నర్స్ : స్టాఫ్ నర్స్ పోస్టులకు అభ్యర్థులు జీఎన్ఎం (General Nursing and Midwifery-GNM) లేదా బీ.ఎస్సీ నర్సింగ్ (B.Sc(Nursing)) చేసిన వారు అర్హులు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (Telangana State Medical Council)లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
సపోర్టింగ్ స్టాఫ్: సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతి (SSC) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నిమిత్తం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి. DM&HO, Warangal
పేరిట డీడీ తీయాలి.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు వరంగల్ జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://warangal.telangana.gov.in/) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి.
అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అలాగే, పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్/బీ.ఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ప్రైవేటులో చదివిన వారు రెసిడెన్స్ సర్టిఫికెట్ దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్, మాజీ సైనికులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అక్నాలెడ్జ్ మెంట్ కార్డ్, డీడీ జత చేయాలి.
ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 16, 2022, ఉదయం 10:30 గంటల నుంచి ఆగస్టు 24, 2022 సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ లోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 24, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– Medical Officer Staff Nurse Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…