Medical Officer Staff Nurse Posts : రంగారెడ్డి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్తీ దవాఖానాల్లో (Basthi Dawakana) మెడికల్ ఆఫీసర్ (Medical Officer), స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం డెబ్బై (70) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, అభ్యర్థుల వయసు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Vacancies
1. Medical Officer – 35
2. Staff Nurse – 35
Salary per Month
Medical Officer – రూ.52,000
Staff Nurse – రూ.29,900
Eligibility
Medical Officer :
- మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
- అలాగే, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Staff Nurse :
- స్టాఫ్ నర్స్ పోస్టులకు జీఎన్ఎం (GNM) లేదా బీ.ఎస్సీ (నర్సింగ్) (B.Sc(Nursing)) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
- అలాగే, నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు (మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్) దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జులై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల లోపు ఉండాలి.
మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Application Fee
ఓసీ మరియు బీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాలి. ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి. District Medical & Health Officer, Rangareddy పేరిట డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://rangareddy.telangana.gov.in/)లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అప్లికేషన్ ఫాంకు ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి (SSC) మెమో
2. ఇంటర్మీడియట్ మెమో
3. ఎంబీబీఎస్/బీ.ఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లు
4. అన్ని అర్హత పరీక్షల మార్కుల మెమోలు
5. ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు
6. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
7. కులం సర్టిఫికెట్
8. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (ప్రైవేటులో చదివిన వారు రెసిడెన్స్ సర్టిఫికెట్)
9. దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్
10. మాజీ సైనికులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
11. అక్నాలెడ్జ్ మెంట్ కార్డ్
12. డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్)
ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 19, 2022 సాయంత్రం 5 గంటల వరకు రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో
అందజేయాలి.
కార్యాలయం చిరునామా :
O/o District Medical & Health Officer,
Ranga Reddy District,
Near Pillar No.294 of PVNR Express Way,
Manikanta Colony, Shivarampally,
Rajendra Nagar,
Ranga Reddy District.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది.
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం పోస్టుల ఎంపిక నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులలో 90 మార్కులు విద్యార్హతలకు, 10 మార్కులు వయసుకు కేటాయిస్తారు.
– Medical Officer Staff Nurse Posts