Education

Master in Hospital Management Course in NIMS

MHM Course in NIMS : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2022 సంవత్సరానికి గాను మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులో (Master in Hospital Management-MHM) ప్రవేశానికి నోటిఫికేషన్ (Rc.No.AC2/172/2022/MHM) జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫాం హార్డ్ కాపీని నిమ్స్ కు పంపించాలి.

Details of Course

కోర్సు పేరు : Master in Hospital Management
కోర్సు వ్యవధి : రెండు (02) సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు) + 6 నెలలు ఇంటర్న్ షిప్
సీట్ల సంఖ్య: ఇరవై (20)
ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది.

Eligibility

ఏదైనా విభాగంలో డిగ్రీ (మెడిక‌ల్/ నాన్ మెడిక‌ల్‌) ఉత్తీర్ణులైన వారు అర్హులు.

Age Limit

డిసెంబర్ 31, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Criteria

రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అడిషన్లు కల్పిస్తారు.
రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది.
100 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ప్రశ్న పత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది.
హెల్త్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు, అడ్మినిస్ట్రేషన్ నుంచి 10 ప్రశ్నలు, కంప్యూటర్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు, ఐక్యూ టెస్ట్ నుంచి 15 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
ఓసీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అవుతారు.
రాత పరీక్ష తేదీ, సమయం, సెంటర్ హాల్ టికెట్ లో తెలియజేస్తారు.
అభ్యర్థులు నిమ్స్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబై సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో Apply Online పై క్లిక్ చేయాలి. అందులో Register Yourself పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత ఫోన్ నెంబర్ కు అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ వస్తాయి.
ఆ తర్వాత లాగిన్ పేజీ ఓపెన్ చేసి అందులో అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది.
అందులోని వివరాన్నీ పూరించి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత రూ.1100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
అనంతరం డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.
దానిపై సంతకం చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి నిమ్స్ కు పంపించాలి.

అప్లికేషన్ హార్ట్ కాపీతో పాటు పంపించాల్సిన డాక్యుమెంట్లు
1. సెల్ఫ్ అటెస్టెడ్ డిగ్రీ మెమోలు
2. సెల్ఫ్ అటెస్టెడ్ ప్రొవిజినల్/ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్
3. సెల్ఫ్ అటెస్టెడ్ డిగ్రీ ట్రాన్స్ ఫర్/ మైగ్రేషన్ సర్టిఫికెట్
4. సెల్ఫ్ అటెస్టెడ్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (9వ తరగతి నుంచి డిగ్రీ వరకు)
5. సెల్ఫ్ అటెస్టెడ్ పదో తరగతి మార్కుల మెమో
6. సెల్ఫ్ అటెస్టెడ్ సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
7. సర్వీస్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
8. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)

అప్లికేషన్ ఫాం, డాక్యుమెంట్లు పంపించాల్సిన చిరునామా :
Associate Dean,
Academic-2.
2nd Floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Punjagutta, Hyderabad – 500082.

అప్లికేషన్ ఫాం, డాక్యుమెంట్లు పోస్టు (ఇండియన్ పోస్టల్ సర్వీస్) ద్వారా గానీ, లేదా నేరుగా వెళ్లిగానీ అందజేయవచ్చు.

ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రక్రియలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-23489018 నెంబర్ కు ఫోన్ చేసి (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) గానీ, webmaster@nims.edu.in కు మెయిల్ చేసి గానీ పరిష్కారం పొందవచ్చు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2022
అప్లికేషన్ హార్ట్ కాపీ చేరాల్సిన తేదీ: సెప్టెంబర్ 15, 2022
హాల్ టికెట్ల జారీ : అక్టోబర్ 03, 2022 నుంచి
రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 07, 2022
తాత్కాలిక ఫలితాల ప్రదర్శన : అక్టోబర్ 10, 2022
రీ కౌంటింగ్ కు చివరి తేదీ: అక్టోబర్ 11, 2022 (సాయంత్రం 4 గంటల వరకు)
అర్హులైన అభ్యర్థుల మెరిట్ జాబితా ప్రదర్శన : అక్టోబర్ 14, 2022
ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక ఫలితాల ప్రదర్శన : అక్టోబర్ 17, 2022
ప్రవేశ ప్రక్రియ/ తాత్కాలిక ఎంపిక : అక్టోబర్ 20, 2022
తరగతులు ప్రారంభం : నవంబర్ 01, 2022 నుంచి
అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు : డిసెంబర్ 31, 2022
అడ్మిషన్ తేదీ, ఫీజు చెల్లింపు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్ సమర్పించు తేదీలను తర్వాత తెలియజేస్తారు.

Fee Structure

అడ్మిషన్ ఫీజు : రూ.5వేలు (One Time, Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ : రూ.1,000 (One Time, Refundable)
ట్యూషన్ ఫీజు :
సెమిస్టర్ కు రూ.36.250 చొప్పున నాలుగు నెమిస్టర్లు చెల్లించాలి.
లైబ్రరీ ఫీజు :
సెమిస్టర్ కు రూ.1,000 చొప్పున నాలుగు సెమిస్టర్లు చెల్లించాలి..
పరీక్ష ఫీజు :
సెమిస్టర్ కు రూ.1.500 చొప్పున నాలుగు సెమిస్టర్లు చెల్లించాలి.

– MHM Course in NIMS

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago