Contract Job

MLHP Jobs in Telangana

MLHP Jobs in Telangana : నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు (Muncipal Areas), నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో (Non Muncipal Areas) గల వెల్ నెస్ సెంటర్ల (Health and Wellness Centres-HWC) లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ వైద్యులు, బీ.ఎస్సీ(నర్సింగ్), జీఎన్ఎం చేసిన స్టాఫ్ నర్స్ లతో ఖాళీగా ఉన్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (Mid Level Health Providers-MLHP) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 1,569 (మున్సిపాలిటీల్లో 349 పోస్టులు, నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 1,220) పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను మున్సిపాలిటీల్లో ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ చేసిన వైద్యులతో భర్తీ చేస్తారు. ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లోనూ ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ చేసిన వైద్యులతో భర్తీ చేస్తారు. ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఈ స్థానాల్లో పనిచేయడానికి ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ చేసిన వైద్యులు రాకపోతే ఆ స్థానాల్లో 2020 తర్వాత బీ.ఎస్సీ(నర్సింగ్ చేసిన వారికి, 2000కి ముందు బీ.ఎస్సీ(నర్సింగ్)/ జీఎన్ఎఎం చేసి కమ్యూనిటీ హెల్త్ లో ఆరు (06) నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం (CPCH) చేసిన స్టాఫ్ నర్స్ లకు అవకాశం కల్పిస్తారు.
జిల్లాల వారీగా నియామకాలకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

District Wise Vacancies

ఆదిలాబాద్: 53, ఆసిఫాబాద్ : 56, భద్రాద్రి కొత్తగూడెం : 103, జగిత్యాల : 51, జనగామ : 32, జయశంకర్ భూపాలపల్లి : 27, జోగులాంబ గద్వాల : 26, కామారెడ్డి : 81, కరీంనగర్ : 14, ఖమ్మం: 38, మహబూబాబాద్ : 50, మహబూబ్ నగర్ : 10, మంచిర్యాల : 37, మెదక్ : 68, మేడ్చల్, మల్కాజిగిరి : 27, ములుగు : 33, నాగర్ కర్నూల్ : 41, నల్గొండ: 96, నారాయణపేట : 37, నిర్మల్ : 42, నిజామాబాద్ : 105, పెద్దపల్లి : 20, రాజన్న సిరిసిల్ల : 27, రంగారెడ్డి : 94, సంగారెడ్డి : 02, సిద్దిపేట : 82, సూర్యాపేట 44, వికారాబాద్ : 62, వనపర్తి : 29, వరంగల్ : 30, హనుమకొండ : 08, యాదాద్రి భువనగిరి : 35.

Details of Posts

1. Medical Officer – MBBS
2. Medical Officer- Ayurveda
3. Staff Nurse

Qualifications

Medical Officer (MBBS) :
ఎంబీబీఎస్ చేసి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

Medical Officer (Ayurveda) :
బీఏఎంఎస్ చేసి, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

Staff Nurse :
1. 2020 తర్వాత బీ.ఎస్సీ( నర్సింగ్) చేసిన వారు.
2. 2020కి ముందు బీ.ఎస్సీ (నర్సింగ్) చేసి కమ్యూనిటీ హెల్త్ లో ఆరు (06) నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం (CPCH) చేసిన వారు.
3. 2020కి ముందు జీఎన్ఎం చేసి కమ్యూనిటీ హెల్త్ లో ఆరు (06) నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం (CPCH) చేసిన వారు అర్హులు.

Salary

MBBS/BAMS Doctors – Rs.40,000
Staff Nurse – Rs.29,900

Age Limit

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Procedure

ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
MBBS/BAMS/B.Sc(Nursing)/ GNM లలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రిజర్వేషన్లు వర్తిస్తాయి.
MBBS/BAMS వైద్యుల పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోకి, స్టాఫ్ నర్స్ పోస్టులు జోనల్ పరిధిలోకి వస్తాయి.

How to Apply

అన్ని జిల్లాల అధికారిక వెబ్ సైట్ లలో అప్లికేషన్ ఫాంలు అందుబాటు లో ఉంటాయి.
వాటిని డౌన్ లోడ్ చేసుకొని, అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
అలాగే, అన్ని విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, పుట్టిన తేదీ, కులం సర్టిఫికెట్, లోకల్ స్టేటస్, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలు, అక్నాలెడ్జ్ మెంట్ కార్డ్ జతచేసి సంబంధిత జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందజేయాలి.
ఒకవేళ వెబ్ సైట్ లో దరఖాస్తు ఫాం లేని ఎడల సంబంధిత కార్యాలయంలో సంప్రదించవచ్చు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)

జిల్లాల అధికారిక వెబ్ సైట్ లు https://nizamabad.telangana.gov.in/ ఇలా ఉంటాయి.
(పైన సూచించిన లింక్ లో nizamabad ప్లేస్ లో మీ జిల్లా పేరు ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మీ జిల్లా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
ఉదాహరణ: సంగారెడ్డి జిల్లా https://sangareddy.telangana.gov.in/)

– MLHP Jobs in Telangana

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago