MPH Course in KNRUHSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

MPH Course in KNRUHS : వరంగల్ లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of Health Sciences – KNRUHS) అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Master of Public Health – MPH) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 40 సీట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కులను బట్టి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Course

మొత్తం సీట్లు – 40
కాంపిటెంట్ అథారిటీ కోటాలో 20 సీట్లు.
మేనేజ్మెంట్ కోటాలో 16 సీట్లు
ఫారిన్ నేషనల్స్ కోటాలో 04 సీట్లు ఉంటాయి.

Educational Qualification

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో సభ్యత్వం కలిగి ఉండాలి.
డిస్టెన్స్ మోడ్ లో డిగ్రీ చేసినట్టయితే ఆ యూనివర్సిటీ యూజీసీ, ఏఐయూ తో పాటు దూర విద్యా మండలి (డీఈసీ) గుర్తింపు పొంది ఉండాలి.

Course Duration

కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ ఆరు నెలలు ఉంటుంది. రెండో సెమిస్టర్ లో రెండు నెలల ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఇంటర్న్ షిప్ సమయంలో విద్యార్థులు రెండు నెలలు ఫీల్డ్ శిక్షణ పొంది నివేదిక అందించాల్సి ఉంటుంది.
కాంపిటెంట్ అథారిటీ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో సీటు రావాలంటే అభ్యర్థులు ఎంట్రెన్స్ టెస్ట్ లో కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ,
ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం వచ్చినా సరిపోతుంది.
ఈ కోర్సుకు గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యండా ఉండాలి.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీకి చెందిన వెబ్ సైట్ (https://www.knruhs.telangana.gov.in/) ను ఓపెన్ చేయాలి. అందులో OUR NOTIFICATIONS లో VIEW ALL పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత KNRUHS – MPH ADMISSIONS 2022-23 – REGISTRATION LINK FOR MPH COURSE పక్కన ఉన్న View పై క్లిక్ చేయాలి. అందులో https://cdn3.digialm.com/EForms/configuredHtml/1680/801 79/Index.html పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత New Registration పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం అభ్యర్థులు రూ.4 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3వేలు చెల్లించాలి. ఆ తర్వాత Applicant Login పై క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. దానిలోని వివరాలన్నీ నింపి, సంబంధిత డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత దానిని ప్రింట్ తీసుకొని సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి నవంబర్ 19, 2022లోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
To
The Convener,
PG Admissions Committee,
KNR University of Health Sciences,
Warangal.
దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఆన్ లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 19, 2022 మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
పూర్తిచేసిన దరఖాస్తు పంపించడానికి చివరి తేదీ నవంబర్ 19, 2022 సాయంత్రం 5 గంటల వరకు.
హాల్ టికెట్ల డౌన్ లోడ్ నవంబర్ 24, 2022 నుంచి.
కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ నవంబర్ 27, 2022 మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది.
అభ్యర్థులు 2 గంటలకె పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్ష కేంద్రం హైదరాబాద్ లో ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 9490823776 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.
అర్హతలు, నిబంధనల కోసం 9490585796 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

– MPH Course in KNRUHS