MPT Admissions in NIMSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

MPT Admissions in NIMS : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2022 విద్యా సంవత్సరానికి మూడు స్పెషలైజేషన్ లలో రెండు సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (Master of Physiotherapy-MPT) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులో మొత్తం 15 సీట్లు ఉంటాయి. ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీని నిమ్స్ కు పంపించాల్సి ఉంటుంది.

Specialty, Seats, Duration

1. ఎంపీటీ-మస్క్యులో స్కెలెటల్ సైన్సెస్
(MPT – Musculoskeletal Sciences)
సీట్లు : ఐదు (05)
కోర్సు వ్యవధి : రెండు (02) సంవత్సరాలు

2. ఎంపీటీ-కార్డియోవాస్క్యులర్ అండ్ పల్మనరీ సైన్సెస్
(MPT – Cardiovascular & Pulmonary Sciences)
సీట్లు ఐదు : (05)
కోర్సు వ్యవధి : రెండు (02) సంవత్సరాలు

3. ఎంపీటీ-న్యూరో సైన్సెస్
(MPT – Neuro sciences)
సీట్లు : ఐదు (05)
కోర్సు వ్యవధి : రెండు (02) సంవత్సరాలు

Qualification

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ (BPT) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
  • సెప్టెంబర్ 30, 2022 నాటికి ఆరు (06) నెలల ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి.
  • ఇతర కోర్సులలో ప్రవేశం పొంది ఉండకూడదు.

Age Limit

అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 22 సంవత్సరాలు నిండిఉండాలి. 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Procedure

ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఇస్తారు.
పరీక్ష 60 నిమిషాలలో రాయాల్సి ఉంటుంది.
ప్రశ్నలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ నుంచి ఇస్తారు.
క్వాలిఫై కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
క్వాలిఫై అయిన అభ్యర్థులను కౌన్సెలింగ్ కు ఆహ్వానించి అడ్మిషన్లు కల్పిస్తారు.

Course Fee

అడ్మిషన్ ఫీజు – రూ.5,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.2,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.90,000 చొప్పున రెండు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున రెండు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున రెండు సంవత్సరాలు.

How to Apply

అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in) ను ఓపెన్
చేసి అందులో Apply Online పై క్లిక్ చేయాలి. అందులో ముందుగా Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రూ.11,00 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Documents to be Submitted

ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మార్క్స్ మెమోలు
2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్
3. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రొవిజినల్/ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (9వ తరగతి నుంచి బీపీటీ వరకు)
5. రెసిడెన్స్ సర్టిఫికెట్
6. సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
7. పదో తరగతి మార్క్స్ మెమో
8. బీపీటీ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
9. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను అక్టోబర్ 19, 2022 సాయంత్రం 5 గంటల లోపు The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad-500 082 చిరునామాకు పంపించాలి.
రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి. లేదా, [email protected] ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు. వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

Importanat Dates

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2022
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: అక్టోబర్ట్ 19, 2022
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : నవంబర్ 07, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్ 10, 2022
తాత్కాలిక ఫలితాల వెల్లడి: నవంబర్ 12, 2022
రీ-కౌంటింగ్ కు అప్లై: నవంబర్ 13, 2022 (సాయంత్రం 4 గంటల వరకు)
తుది ఫలితాలు వెల్లడి : నవంబర్ 16, 2022
కౌన్సెలింగ్ తేదీ: నవంబర్ 21, 2022
తరగతులు ప్రారంభం: డిసెంబర్ 05, 2022

– MPT Admissions in NIMS