NEET 2023 Free CoachingA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

NEET 2023 Free Coaching : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social Welfare Residential Educational Institutions Society-TSWREIS) ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ (OPBC) ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల (Schedule caste-SC) బాల బాలికలకు NEET-2023 కు లాంగ్ టర్మ్ కోచింగ్ (Long Term NEET Coaching) ఇచ్చేందుకు నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 2022-23 విద్యా సంవత్సరంలో NEET- 2023 కు హాజరుకాబోయే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. NEET-2022 వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ కోచింగ్ కు ఎంపిక చేస్తారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Number of Seats

హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలో గల TSWR COE (G), TSWR IIT (B), చిలుకూరులోని TSWR COE (B), నార్సింగిలోని TSWR COE (G) కాలేజీల్లో ఈ శిక్షణ ఇస్తారు.
గౌలిదొడ్డిలో గల TSWR COE (G), TSWR IIT (B) కాలేజీల్లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. ఇందులో 100 సీట్లు బాలికలకు, 100 సీట్లు బాలు
రకు కేటాయించారు. ఈ 200 సీట్లలో 190 ఎస్సీ (SC) విద్యార్థులకు, ఐదు (05) సీట్లు ఓబీసీ (OBC) విద్యార్థులకు , ఐదు (05) సీట్లు ఈడబ్ల్యూఎస్ (EWS) విద్యార్థులకు కేటాయించారు.
చిలుకూరులోని TSWR COE (B) కాలేజీలో మొత్తం యాభై (50) సీట్లు ఎస్సీ (SC) బాలురకు కేటాయించారు.
నార్సింగిలోని TSWR COE (G) కాలేజీలో మొత్తం యాభై (50) సీట్లు ఎస్సీ (SC) బాలికలకు కేటాయించారు.
గౌలిదొడ్డిలోని కాలేజీల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పది (10) సీట్లను జెండర్ తో సంబంధం లేకుండా NEET- 2022 వచ్చిన
మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.

Eligibility

ఇంటర్మీడియట్ పూర్తిచేసి NEET- 2022 రాసి ఉండాలి.
NEET-2022లో ఎస్సీ అభ్యర్థులు 250/720 మార్కులు సాధించి ఉండాలి.
గౌలిదొడ్డి (బాయ్స్ అండ్ గల్స్) కాలేజీలో చదివిన విద్యార్థులు 300/720 మార్కులు సాధించి ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులు 350/720 మార్కులు సాధించి ఉండాలి.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 400/’720 మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
ఇంతకు ముందు ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ (OPBC) ప్రోగ్రాంలో శిక్షణ తీసుకొని ఉండకూడదు.

How to Apply

  • ఆసక్తి కలిగిన విద్యార్థులు TSWREIS వెబ్ సైట్ (www.tswreis.ac.in)ను ఓపెన్ చేసి అందులోని New Long Term NEET Coaching for the Academic Year 2022-23 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Click here : To Pay online application fee పై క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, కులం వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Click here : To submit online application పై క్లిక్ చేసి పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి, NEET-2022 స్కోర్ కార్డ్ ను అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. NEET-2022 స్కోర్ కార్డ్ అప్ లోడ్ చేయని అప్లికేషన్ ఫాంలను తిరస్కరిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తారు. అలాగే, సంస్థ వెబ్ సైట్ లోనూ పెడతారు.
  • గౌలిదొడ్డిలోని TSWR COE(G) కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2022
అభ్యర్థుల ఎంపిక : సెప్టెంబర్ 25, 2022
సర్టిఫికెట్ల పరిశీలన : సెప్టెంబర్ 26, 2022
తరగతులు ప్రారంభం : సెప్టెంబర్ 27, 2022

– NEET 2023 Free Coaching