Education

Nursing Jobs in foreign countries

Nursing Jobs in foreign countries : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) (Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) బీ.ఎస్సీ(నర్సింగ్), జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జీఎన్ఎం)(General Nursing and Midwifery-GNM), పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన శిక్షణ ఇచ్చి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

Countries

ప్రస్తుతం టామ్ కామ్ ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, జపాన్, న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ తదితర దేశాలలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తోంది.

Workshop on 11th Jan

విదేశాలలో నర్సింగ్, పారామెడికల్ ఉద్యోగాలపై ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్) తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను టామ్ కామ్ యాప్ లో, లేదా నేరుగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

Role of TOMCOM

  • విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.
  • విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ అప్ గ్రేడేషన్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది.
  • అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తుంది.
  • ఓవర్సీస్ ఎంప్లాయర్స్ మీటింగ్ నిర్వహిస్తుంది.
  • రిక్రూటింగ్ ఏజెంట్ల సమావేశం, శిక్షకుల శిక్షణ వర్క్‌షాప్‌లు మొదలైనవి ఏర్పాటు చేస్తుంది.
  • ప్రయాణం, పాస్‌పోర్ట్, వీసా మరియు స్టాంపింగ్ సహాయం అందించడంలో సహాయపడుతుంది.
  • విదేశీ పని పరిస్థితులు, పని వాతావరణం మరియు అక్కడి కల్చర్ తో పరిచయం చేయడానికి సహకరిస్తుంది.
  • ఇతర దేశాలలో జాబ్ మార్కెట్ డిమాండ్‌లను అంచనా వేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.

Qualification

ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సింగ్ కాలేజీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM), B.Sc (Nursing) పారామెడికల్ కోర్సులు చేసిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.

How to Registration

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Tomcom) వెబ్ సైట్ (http://tomcom.telangana.gov.in) ఓపెన్ చేయాలి.
  • అందులో మూడు ఫొటోలు కనిపిస్తాయి.
  • వాటిలో మొదటి ఫొటోపై క్లిక్ చేయాలి.
  • అందులో రిజిస్ట్రేషన్ ఫాం వస్తుంది.
  • అందులోని వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి.
  • ముందుగా పూర్తి పేరు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత క్వాలిఫికేషన్, ఆ తర్వాత జిల్లా, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, అనుభవం, తర్వాత ఏ దేశంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు తదితర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Date and Venue

జనవరి 11, 2023, ఉదయం 10 గంటలకు, గాంధీ హాస్పిటల్ హైదరాబాద్.

వర్క్ షాప్ నకు సంబంధించిన పూర్తి వివరాలకు 9502894238, 8328602231 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

– Nursing Jobs in foreign countries

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago