Para Medical Jobs in SSB : న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs, Government of India)కు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) (Sashastra Seema Bal-SSB) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (పారా మెడికల్) (Assistant Sub-Inspector (Combatised Para-Medical Staff) )పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఫార్మాసిస్ట్ (Pharmacist), రేడియోగ్రాఫర్(Radiographer), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ (Operation Theatre Technician), డెంటల్ టెక్నీషియన్ (Dental Technician) పోస్టుల భర్తీకి ప్రకటన విదుల చేసింది. ఇవి గ్రూప్-సీ నాన్ గెజిటెడ్ పోస్టులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు – 30
1. ఏఎస్ఐ (ఫార్మాసిస్ట్) – 07 (ఓబీసీ – 01, ఎస్టీ – 02, ఎస్సీ – 04)
2. ఏఎస్ఐ (రేడియోగ్రాఫర్) – 21 (అన్‌రిజర్వుడ్ – 10, ఈడబ్ల్యూఎస్ – 02, ఓబీసీ – 05, ఎస్టీ – 01, ఎస్సీ – 03)
3. ఏఎస్ఐ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) – 01 (అన్‌రిజర్వుడ్)
4. ఏఎస్ఐ (టెంటల్ టెక్నీషియన్) – 01 (అన్‌రిజర్వుడ్)
ఏఎస్ఐ (ఫార్మాసిస్ట్) :
సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫార్మసిలో డిగ్రీ లేదా డిప్లొమా పాసై ఉండాలి.
ఫార్మాసిస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
ఏఎస్ఐ (రేడియోగ్రాఫర్) :
సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
రేడియో డయాగ్నోసిస్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన హాస్పిటల్లో రేడియోలాజికల్ డిపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి.
ఏఎస్ఐ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) :
సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లో డిప్లొమా లేదా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కమ్ సెంట్రల్ స్టెరైల్ సప్లై అసిస్టెంట్ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా రెండు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
ఏఎస్ఐ (టెంటల్ టెక్నీషియన్) :
సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
రెండు సంవత్సరాల డెంటల్ హైజినిస్ట్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
డెంటల్ టెక్నీషియన్‌గా ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఆన్లైన్లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) వెబ్సైట్ (www.ssbrectt.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.100లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ఉద్యోగాల ప్రకటన వెలువడిన 30 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ ను గమనిస్తూ ఉండాలి.
– Para Medical Jobs in SSB
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…