Paramedical Jobs in NITC : కేరళ (Kerala) రాష్ట్రంలోని కాలికట్ లోగల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology Calicut-NITC) కి చెందిన ఇనిస్టిట్యూట్ హెల్త్ సెంటర్ (Institute Health Centre) లో స్టాఫ్ నర్స్, ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
1. Staff Nurse
2. Pharmaceutical Assistant
3. Nursing Assistant (Male -1)
Staff Nurse : ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(GNM) కోర్సు చేసిన వారు అర్హులు. ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Pharmaceutical Assistant : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో సైన్స్ సబ్జెక్ట్ ప్లస్ (10+2) లేదా హయ్యర్ సెకండరీ చేసి ఉండాలి. అలాగే, ఫార్మసీ కౌన్సిల్ ఇండియా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో డిప్లొమా (D.Pharma) లేదా డిగ్రీ (B.Pharma) చేసి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా చేసిన వారు గుర్తింపు పొందిన హాస్పిటల్ లేదా ఫార్మసిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. అలాగే, ఫార్మసీ కౌన్సిల్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
Nursing Assistant : పదో తరగతి లేదా ప్లస్ (10+2) లేదా హయ్యర్ సెకండరీ చేసి ఉండాలి. అలాగే, నర్సింగ్ కేర్ అసిస్టెంట్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
స్టాఫ్ నర్స్ – రూ.22,516
ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్ – రూ.20,488
నర్సింగ్ అసిస్టెంట్ – రూ.17,446
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ వెబ్ సైట్ (http://www.nitc.ac.in/) ని ఓపెన్ చేయాలి. కొంచెం కిందికి స్క్రోల్ చేసి ADVERTISEMENTS పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Job Opportunities@NITC పై క్లిక్ చేయాలి. అందులో
Walk-in-interview for the selection of staff in Health Centre of NITC (Pharmaceutical Assistant, Staff Nurse and Nursing Assistant) పై క్లిక్ చేయాలి. అందులో Application Form పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం డౌన్ లోడ్ అవుతుంది. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలు, అనుభవం, కులంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి.
వాటితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
స్టాఫ్ నర్స్ – 27-12-2022 (ఉదయం 9 గంటల నుంచి)
నర్సింగ్ అసిస్టెంట్ – 27-12-2022 (ఉదయం 9 గంటల నుంచి)
ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్ – 03-01-2023 (ఉదయం 9 గంటల నుంచి)
స్థలం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్, ఇనిస్టిట్యూట్
హెల్త్ సెంటర్, నిట్ క్యాంపస్, కాలికట్, కేరళ.
– Paramedical Jobs in NITC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…