PG and Diploma Courses in AU

PG and Diploma Courses in AU : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), బొల్లినేని మెడ్ స్కిల్స్ (Bollineni Medskills) సహకారంతో 2022-23 విద్యా సంవత్సరంలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బొల్లినేని మెడ్ స్కిల్స్ ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీలోని ఒక యూనిట్. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Details of Courses

1. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
2. పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ
3. పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ
4. పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ

Master of Hospital Administration

కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
కోర్సు వ్యవధి: రెండు (02) సంవత్సరాలు
అర్హతలు: ఏదైనా గ్రూపులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సీట్ల సంఖ్య: నలభై (40)
కోర్సు ఫీజు: రూ.45,000 (ఏడాదికి)

PG Diploma in Critical Care Technology

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం
అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, బీ.ఎస్సీ, బీ.ఫార్మసీ, బీ.ఎస్సీ (నర్సింగ్)/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.
సీట్ల సంఖ్య: పదిహేను (15)
కోర్సు ఫీజు: రూ.50,000 (ఏడాదికి)

PG Diploma in Emergency Medicine Technology

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం
అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, బీ.ఎస్సీ, బీ.ఫార్మసీ, బీ.ఎస్సీ (నర్సింగ్)/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.
సీట్ల సంఖ్య: పదిహేను (15)
కోర్సు ఫీజు: రూ.50,000 (ఏడాదికి)

PG Diploma in Gastroenterology Technology

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం
అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, బీ.ఎస్సీ, బీ.ఫార్మసీ, బీ.ఎస్సీ (నర్సింగ్)/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.
సీట్ల సంఖ్య: పదిహేను (15)
కోర్సు ఫీజు: రూ.50,000 (ఏడాదికి)

Age Limit

20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం The Registrar, AU Common Entrance Test & Admissions పేరిట రూ.500 డీడీ తీయాలి. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ వెబ్ సైట్ (www.audoa.in)లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై జూన్ 1, 2022 తర్వాత తీయించుకొన్న పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలి. అలాగే, అందులోని వివరాలన్నింటినీ పూర్తిగా నింపాలి.
డీడీ నెంబర్ రాయాలి. కోర్సు పేరు, అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, జెండర్, పుట్టిన తేదీ, నివాస ప్రాంతం, రిజర్వేషన్ కేటగిరీ, అర్హత పరీక్షకు సంబంధించిన వివరాలు రాయాలి.
మాస్టర్ అఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరే అభ్యర్థులు ఒకటి నుంచి 7వ తరగతి వరకు, పీజీ డిప్లొమా కోర్సులో చేరే అభ్యర్థులు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన ప్రాంతం, సంవత్సరం, విద్యాసంస్థ వివరాలు నింపాలి.

ఈ క్రింది సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అప్లికేషన్ ఫాంకు జత చేయాలి.

1. విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ సర్టిఫికెట్
2. విద్యార్హతకు సంబంధించిన మార్క్స్ షీట్
3. ట్రాన్స్ఫర్ అండ్ కండక్ట్ సర్టిఫికెట్ (చివరగా చదివిన విద్యా సంస్థ నుంచి తీసుకొన్నది)
4. పుట్టిన తేదీ సర్టిఫికెట్ (ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్)
5. మైగ్రేషన్ సర్టిఫికెట్ (ఇతర యూనివర్సిటీల అభ్యర్థులు)
6. ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్
7. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు)
వీటన్నింటితో పాటు డీడీని కూడా అప్లికేషన్కు జతచేసి ఆంధ్రా యూనివర్సిటీకి పంపించాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of the Directorate of Admissions,
Andhra University, Vijayanagar Palace,
Pedawaltair, Visakhapatnam-530003.

  • దరఖాస్తులు జూలై 31, 2022 సాయంత్రం 5 గంటల వరకు చేరేలా పంపాలి. రూ.500 ఆలస్య రుసుముతో అగస్టు 8, 2022 వరకు పంపవచ్చు.
  • కౌన్సెలింగ్ ఆగస్టు 8, 2022న నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఎలాంటి కాల్ లెటర్ పంపించరు. కౌన్సెలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు ఆ సమయంలో కౌన్సెలింగ్ ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
  • కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ క్లాసులు విశాఖపట్నంలోని శీలానగర్ లో గల Bollineni Medskills, KIMS-ICON Hospital Campus లో జరుగుతాయి.
  • పూర్తి వివరాలకు ఆంధ్రా యూనివర్సిటీ వెబ్ సైట్ (www.audoa.in), లేదా 79950 13421 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

– PG and Diploma Courses in AU