Pharmacist Jobs in ITBPF : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (Indo Tibetan Border Police Force-
ITBPF) అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫార్మసిస్ట్) (Assistant Sub Inspector (Pharmacist)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24
పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇవి గ్రూప్-సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
Assistant Sub Inspector (Pharmacist)
(Group-‘C’ (Non-Gazetted & Non Ministerial))
Reservation Wise Vacancies
మొత్తం పోస్టులు – 24
అరిజర్వుడ్ (UR) – 12
ఈడబ్ల్యూఎస్ (EWS) – 02.
ఓబీసీ (OBC) – 06
ఎస్సీ (SC) – 03
ఎస్టీ (ST) – 01
Pay Scale
Level-5 in the Pay Matrix రూ.29,200 – 92,300 (7వ CPC ప్రకారం). ఈ జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
Education Qualifications
గుర్తింపు పొందిన బోర్డులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన సంస్థలో ఫార్మసీలో డిప్లొమా చేసిన వారు అర్హులు.
Age Limit
అభ్యర్థుల వయసు నవంబర్ 23, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. అలాగే, అన్ రిజర్వుడ్/ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు, ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఆరు, ఎస్సీ, ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎనిమిది, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంది.
Selection Procedure
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు టెస్ట్ లలో క్వాలిఫై అయిన అభ్యర్థులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో పెడతారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి నుంచి 10 ప్రశ్నలు, న్యుమరికల్ అప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, ఇంగ్లిష్/ హిందీ కాంప్రహెన్షన్ నుంచి 10 ప్రశ్నలు ట్రేడ్/ ప్రొఫెషన్ రిలేటెడ్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
How to Apply
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ITBPF వెబ్ సైట్ (https://recruitment.itbpolice.nic.in/) లోకి లాగిన్ అయ్యి ముందు గా NEW USER REGISTRATION పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ పూరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత ఈ-మెయిల్ కు పాస్వర్డ్ వస్తుంది వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ITBPF రిక్రూట్మెంట్ వెబ్ సైట్ (https://recruitment.itbpolice.nic.in/) లో మాత్రమే పొందుపరుస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాచారం కోసం తరచూ వెబ్ సైట్ ను చూస్తుంఅప్లికేషన్ సమర్పించే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే rectsupport@itbp.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా 011-24369482 మరియు 24369483 నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల పనితీరును బట్టి పొడిగించవచ్చు.
Website : https://recruitment.itbpolice.nic.in/
– Pharmacist Jobs in ITBPF