Project Scientists Jobs in INCOISA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Project Scientists Jobs in INCOIS : హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Indian National Centre for Ocean Information Services-INCOIS) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఎక్స్ పర్ట్/ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt. No. INCOIS/RMT/04/2022) జారీ చేసింది. మొత్తం 138 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్.. భారత ప్రభుత్వ భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ (Ministry of Earth Sciences, Govt. Of India)కు అనుబంధ స్వయంప్రతిపత్తి (an Autonomous Body) కలిగిన సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ సముద్రాలను పరిశీలిస్తుంది. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుంది. సునామీలాంటి విపత్తులను ముందుగానే పసిగడుతుంది. ఫిషింగ్ జోన్లను గుర్తిస్తుంది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు, పరిశోధనలు చేపడుతుంది. ప్రస్తుతం 2021 నుంచి 2026 వరకు చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Details of Posts

1. Project Scientist-III
2. Project Scientist-II
3. Project Scientist-I
4. Project Assistant
5. Project Scientific Administrative Assistant
6. Expert / Consultant (Scientific-4, Admin-1)

Project Scientist-III

పోస్టుల సంఖ్య : తొమ్మిది (09) (UR)
వయో పరిమితి : 45 సంవత్సరాలు
వేతనం : నెలకు రూ.78,000 + హెచ్ఆర్ఏ
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో M.Sc., M.Tech., M.Sc. (Tech.) చేసిన వారు అర్హులు. Ph.D చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

Project Scientist-II

పోస్టుల సంఖ్య: ఇరవై మూడు (23) (UR)
వయో పరిమితి : 40 సంవత్సరాలు
వేతనం : నెలకు రూ.67,000 + హెచ్ఆర్ఏ
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో M.Sc., M.Tech., M.Sc. (Tech.) చేసిన వారు అర్హులు. Ph.D చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

Project Scientist-I

పోస్టుల సంఖ్య : యాభై తొమ్మిది (59) (UR-26, SC-09, ST-04, OBC-15, EWS-05)
వయో పరిమితి : 35 సంవత్సరాలు
వేతనం: నెలకు రూ.56,000 + హెచ్ఆర్ఏ
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో M.Sc., M.Tech., M.Sc. (Tech.) చేసిన వారు అర్హులు. Ph.D చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

Project Assistant

పోస్టుల సంఖ్య: ముప్పై ఆరు (36) (UR-17, SC-05, ST-02, OBC-09, EWS-03)
వయో పరిమితి : 50 సంవత్సరాలు
వేతనం: నెలకు రూ.20,000 + హెచ్ఆర్ఏ
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో 60 శాతం మార్కులతో B.Sc / BCA / Diploma ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం ఉండాలి.
అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

Project Scientific Administrative Assistant

పోస్టుల సంఖ్య : ఆరు (06) (UR-05, OBC-01)
వయో పరిమితి : 50 సంవత్సరాలు
వేతనం : నెలకు రూ.18,000 + హెచ్ఆర్ఏ
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంగ్లిష్ లో రైటింగ్ మరియు ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం ఉండాలి.

Expert / Consultant

పోస్టుల సంఖ్య : ఐదు (05) (UR)
వయో పరిమితి : 65 సంవత్సరాలు
వేతనం: నెలకు రూ.65,000 నుంచి రూ.లక్ష
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో డాక్టోరల్ డిగ్రీ ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు INCOIS వెబ్ సైట్ (www.incois.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా సమస్యలు తలెత్తితే [email protected]. కు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన
  • కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తారు.
  • ముందుగా ఏడాది కాలానికి ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థి పనితీరు, ప్రాజెక్టు అవసరాన్ని బట్టి మార్చి, 2026 వరకు కొనసాగించవచ్చు.
  • వయో పరిమితిలో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 09, 2022

– Project Scientists Jobs in INCOIS