Project staff Jobs in NGRI

Project staff Jobs in NGRI : హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR-National Geophysical Research Institute-NGRI) కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant), ప్రాజెక్ట్ అసోసియేట్(Project Associate), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (Senior Project Associate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Project Assistants

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant)
పోస్టు కోడ్: ఏ, పోస్టుల సంఖ్య: రెండు (02)
ప్రాజెక్టు నెంబర్: అడ్మినిస్ట్రేషన్ (Administration)
ప్రాజెక్టు వ్యవధి: ఒక సంవత్సరం (One year)
అర్హతలు: బీ.కాం డిగ్రీ. ఎం.కాం చేసి జీఎస్టీ ఫైలింగ్స్ తెలిసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant)
పోస్టు కోడ్: బీ, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: SP-705-28(HVS)
ప్రాజెక్టు వ్యవధి: జూన్ 2023 వరకు
అర్హతలు: గణితం, భౌతికశాస్త్రం, రసాయశాస్త్రం సబ్జెక్టులతో బీ.ఎస్సీ చేసిన వారు అర్హులు. డాటా సేకరణ తెలిసి ఉండాలి.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant)
పోస్టు కోడ్: సీ, పోస్టుల సంఖ్య: ఐదు (05)
ప్రాజెక్టు నెంబర్: SSP-858-28(MRM)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: జియాలజీ లేదా కెమెస్ట్రీ సబ్జెక్టుతో బీ.ఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. లాబోరేటరీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant)
పోస్టు కోడ్: డీ, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: MLP-FBR-0007(KG)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంగ్లిష్ రాయడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

Project Associate-I

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate-I)
పోస్టు కోడ్: ఈ, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: CLP-853-28(KPS)
ప్రాజెక్టు వ్యవధి: ఆగస్టు 2023 వరకు
అర్హతలు: మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీలో ఎం.ఎస్సీ లేదా ఎం.ఎస్సీ(టెక్) చేసిన వారు అర్హులు. లేదా బయోటెక్నాలజీలో బీటెక్ చేసిన వారు కూడా అర్హులే. ఎస్ఈటీ(ఎల్ఎస్) క్వాలిఫై అయి ఉండాలి.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate-I)
పోస్టు కోడ్: ఎఫ్, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: MLP-FBR-0003(AM)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్ లో ఎం.ఎస్సీ లేదా ఎం.ఎస్సీ (టెక్) చేసిన వారు అర్హులు. ఎంటీ డాటా సేకరణలో అనుభవం ఉండాలి.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate-I)
పోస్టు కోడ్: ఎఫ్, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: GAP-812-28(LR)
ప్రాజెక్టు వ్యవధి: ఏప్రిల్ 2023 వరకు
అర్హతలు: జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్ లో ఎం. ఎస్సీ లేదా ఎం.ఎస్సీ(టెక్) చేసిన వారు అర్హులు.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate-I)
పోస్టు కోడ్: హెచ్, పోస్టుల సంఖ్య: రెండు (02)
ప్రాజెక్టు నెంబర్: GAP-799-28(EVSSK)
ప్రాజెక్టు వ్యవధి: ఆగస్టు 2023 వరకు
అర్హతలు: జియాలజీ/అప్లైడ్ జియాలజీలో మాస్టర్స్ చేసిన వారు అర్హులు.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate-I)
పోస్టు కోడ్: హెచ్, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్ : MLP-FBR-0006(EVSSK)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: జియాలజీలో మాస్టర్స్ చేసిన వారు అర్హులు.

Senior Project Associate

పోస్టు పేరు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (Senior Project Associate)
పోస్టు కోడ్: జీ, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: MLP-6404-28(KA)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: జియోఫిజిక్స్ లో మాస్టర్స్ చేసిన వారు అర్హులు. ఐసీఎం, ప్లక్స్ గేట్ డేటా సేకరణ, విశ్లేషణ మరియు SWARM ఉపగ్రహ ప్రాసెసింగ్ లో నాలుగు సంవత్సరాల అనుభవం అవసరం. అలాగే, జియోఫిజిక్స్ లో పీ హెచ్ డీ చేసిన వారు కూడా అర్హులే.

పోస్టు పేరు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (Senior Project Associate)
పోస్టు కోడ్: జీ, పోస్టుల సంఖ్య: ఒకటి (01)
ప్రాజెక్టు నెంబర్: MLP-FBR-0005(MRK)
ప్రాజెక్టు వ్యవధి: మార్చి 2023 వరకు
అర్హతలు: జియోఫిజిక్స్ లో మాస్టర్స్ చేసిన వారు అర్హులు. అలాగే, సీస్కోలాజికల్/సిస్మిక్ డేటా ప్రాసెసింగ్ లో నాలుగు సంవత్సరాల అనుభవంతో పాటు ఫీల్డ్ అనుభవం కూడా తప్పనిసరి. అలాగే, సీస్మోలాజికల్/సిస్మిక్ లో పీ హెచ్ డీ చేసిన వారు కూడా అర్హులే.

Age Limit

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారి వయసు 50 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారి వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారి వయసు 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

ప్రాజెక్ట్ అసిస్టెంట్ – రూ.20,000. ప్రాజెక్ట్ అసోసియేట్-1 – రూ.25,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – రూ.42,000. లెక్చర్ షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ షిప్) లేదా గేట్ తో సహా CSIR-UGC NETలో అర్హత సాధించిన ప్రాజెక్ట్ అసోసియేట్-1 అభ్యర్థులకు రూ.31,000 చెల్లిస్తారు.

అర్హులైన అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, కులం, అనుభవం తదితర అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన ఇంటర్వ్యూ తేదీకి మరుసటి రోజు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి ఇవ్వబడవు. అభ్యర్థులు సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది.

Date & Time of Interviws

14.06.2022 – Post Code F&G at 09:00 AM (Reporting Time: 08:00 AM)
15.06.2022 – Post Code C&H at 09:00 AM (Reporting Time: 08:00 AM)
28.06.2022 – Post Code A, B & D at 09:00 AM (Reporting Time: 08:00 AM)
29.06.2022 – Post Code E at 09:00 AM (Reporting Time: 08:00 AM)

Venue of Interview:

CSIR-National Geophysical Research Institute,
Uppal Road, Hyderabad-500007.

ఫోన్ నెంబర్: 040 2701 2374
ఈ-మెయిల్: [email protected]

– Project staff Jobs in NGRI