Radiographer Jobs in Diagnostics Centres : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో రేడియోగ్రాఫర్ (Radiographer) ఉద్యోగాల భర్తీకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ (Commissioner, Health & Family Welfare (chfw) and Mission Director, NHM) నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 11 కేంద్రాల్లో 11 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
రేడియోగ్రాఫర్ (Radiographer) (మొత్తం పోస్టులు – 11)
ఇది జోనల్ పోస్ట్ ఈ కింది జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (జోన్ -I) – 01
2. మంచిర్యాల్ (జోన్ -I) – 01
3. పెద్దపల్లి (జోన్ -I) – 01
4. జగిత్యాల (జోన్ -II) – 01
5. ఆదిలాబాద్ (జోన్ -II) – 01
6. నిజామాబాద్ (జోన్ -II) – 01
7. కామారెడ్డి (జోన్ -III) – 01
8. మహబుబాబాద్ (జోన్ -IV) – 01
9. యాదాద్రి భువనగిరి (జోన్ -V) – 01
10. జనగామ (జోన్ -V) – 01
11. సంగారెడ్డి (జోన్ -VI) – 01
Qualifications
డిప్లొమా (Diploma) / బీ.ఎస్సీ(రేడియోగ్రఫీ) B.Sc. (Radiography) /డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ (DMIT) చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
Remuneration Per Month
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
Age Limit
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల 01, జులై 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు (ex-service women) మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ (SC, ST & BC) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు (Disabled Persons) పది సంవత్సరాల సడలింపు ఉంది.
Selection Criteria
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జోన్ వైజ్ మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఎంపిక కూడా జోన్ వైజ్ ఉంటుంది.
How to Apply
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా https://forms.gle/fvaXHLb9fSrqf4qg9 లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులో వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాం నింపి సబ్మిట్ చేయాలి. అనంతరం ఆ అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై సంతకం చేసి, దానికి ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.
- ఎస్సెస్సీ మెమో
- ఇంటర్మీడియెట్ మెమో
- క్యాస్ట్ సర్టిఫికెట్
- దివ్యాంగులు, మాజీ సైనికులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
- బోనఫైడ్ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
- క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్లు
- ప్రొవిజినల్ సర్టిఫికెట్
- ఒకటి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
పై అన్ని సర్టిఫికెట్లు ఈ కింది అడ్రస్‌లో ( ఆఫీస్ టైంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) అందజేయాలి.
O/o the Commissioner of Health & Family Welfare & Mission Director,
National Health Mission,
4TH Floor, DME Building,
DM&HS Campus, Koti, Hyderabad.
ఆన్లైన్లో దరఖాస్తుల సమర్ఫణకు చివరి తేదీ : 09 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు
సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫాం అందజేయడానికి చివరి తేదీ : 10 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాలి.
వెబ్ సైట్ : https://forms.gle/fvaXHLb9fSrqf4qg9
– Radiographer Jobs in Diagnostics Centres