Contract Job

Radiographer Jobs in Telangana Diagnostics Centres

Radiographer Jobs in Diagnostics Centres : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్​ కేంద్రాల్లో రేడియోగ్రాఫర్ (Radiographer)​ ఉద్యోగాల భర్తీకి హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​, నేషనల్​ హెల్త్​ మిషన్​ డైరెక్టర్​ (Commissioner, Health & Family Welfare (chfw) and Mission Director, NHM) నోటిఫికేషన్​ జారీ చేశారు. మొత్తం 11 కేంద్రాల్లో 11 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్​, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

రేడియోగ్రాఫర్​ (Radiographer) (మొత్తం పోస్టులు ‌– 11)

ఇది జోనల్​ పోస్ట్​ ఈ కింది జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

1. కుమ్రం​​ భీమ్ ఆసిఫాబాద్ (జోన్ -I) – 01
2. మంచిర్యాల్​ (జోన్ -I) – 01
3. పెద్దపల్లి (జోన్ -I) – 01
4. జగిత్యాల (జోన్ -II) – 01
5. ఆదిలాబాద్ (జోన్ -II) – 01
6. నిజామాబాద్ (జోన్ -II) – 01
7. కామారెడ్డి (జోన్ -III) – 01
8. మహబుబాబాద్ (జోన్ -IV) – 01
9. యాదాద్రి భువనగిరి (జోన్ -V) – 01
10. జనగామ (జోన్ -V) – 01
11. సంగారెడ్డి (జోన్ -VI) – 01

Qualifications

డిప్లొమా (Diploma) / బీ.ఎస్సీ(రేడియోగ్రఫీ) B.Sc. (Radiography) /డిప్లొమా ఇన్​ మెడికల్​ ఇమేజింగ్​ టెక్నాలజీ (DMIT) చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

Remuneration Per Month

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

Age Limit

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల 01, జులై 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు (ex-service women) మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ (SC, ST & BC) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు (Disabled Persons) పది సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Criteria

క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జోన్​ వైజ్​ మెరిట్​ జాబితాను తయారు చేస్తారు. ఎంపిక కూడా జోన్​ వైజ్​ ఉంటుంది.

How to Apply

అర్హులైన, ఆసక్తి క​లిగిన అభ్యర్థులు ముందుగా https://forms.gle/fvaXHLb9fSrqf4qg9 లింక్​ను ఓపెన్​ చేయాలి. అందులో వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాం నింపి సబ్మిట్​ చేయాలి. అనంతరం ఆ అప్లికేషన్​ ఫాంను డౌన్​లోడ్​ చేసుకోవాలి. దానిపై సంతకం చేసి, దానికి ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.

  • ఎస్సెస్సీ మెమో
  • ఇంటర్మీడియెట్​ మెమో
  • క్యాస్ట్​ సర్టిఫికెట్​
  • దివ్యాంగులు, మాజీ సైనికులు, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
  • బోనఫైడ్​ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
  • క్వాలిఫైయింగ్​ సర్టిఫికెట్లు
  • ప్రొవిజినల్​ సర్టిఫికెట్​
  • ఒకటి రీసెంట్​ పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో

పై అన్ని సర్టిఫికెట్లు ఈ కింది అడ్రస్​లో ( ఆఫీస్​ టైంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) అందజేయాలి.

O/o the Commissioner of Health & Family Welfare & Mission Director,
National Health Mission,
4TH Floor, DME Building,
DM&HS Campus, Koti, Hyderabad.

ఆన్​లైన్​లో దరఖాస్తుల సమర్ఫణకు చివరి తేదీ : 09 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు

సబ్మిట్​ చేసిన దరఖాస్తు ఫాం అందజేయడానికి చివరి తేదీ : 10 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాలి.

వెబ్​ సైట్​ : https://forms.gle/fvaXHLb9fSrqf4qg9

– Radiographer Jobs in Diagnostics Centres

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago