Regular Jobs in SBI

Regular Jobs in SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India-SBI) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (CRPD/SCO/2022-23/08) జారీ చేసింది. ఇందులో ఏజీఎం, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు న్నాయి. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు నవీముంబై, బెంగళూరు, వడోదరలో పనిచేయాల్సి ఉంటుంది.

Assistant General Managers

పోస్టు పేరు: ఏజీఎం(ఐటీ-టెక్ ఆపరేషన్స్) AGM (IT- Tech Operations)
పే స్కేల్: బేసిక్ రూ.89890-2500/2-94890-2730/2-100350
పోస్టుల సంఖ్య: ఒకటి (01) అన్ రిజర్వుడ్ (UR), దివ్యాంగులు (PWD LD (OL) (Person with Disabilities(PWD), Locomotive Disability (LD), One Leg Affected(OL))
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

పోస్టు పేరు: ఏజీఎం(ఐటీ – ఇన్ బౌండ్ ఇంజినీర్) AGM (IT- Inbound Engineer)
పే స్కేల్: బేసిక్ రూ.89890-2500/2-94890-2730/2-100350
పోస్టుల సంఖ్య: ఒకటి (01) అన్ రిజర్వుడ్ (UR), దివ్యాంగులు (PWD LD (OL)
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

పోస్టు పేరు: ఏజీఎం (ఐటీ – ఔట్ బౌండ్ ఇంజినీర్) AGM (IT- Outbound Engineer)
పే స్కేల్: బేసిక్ రూ.89890-2500/2-94890-2730/2-100350
పోస్టుల సంఖ్య: ఒకటి (01) అన్ రిజర్వుడ్ (UR), దివ్యాంగులు (PWD LD (OL)
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

పోస్టు పేరు: ఏజీఎం (ఐటీ – సెక్యూరిటీ ఎక్స్ పర్ట్) AGM (IT Security Expert)
పే స్కేల్: బేసిక్ రూ. 89890-2500/2-94890-2730/2-100350
పోస్టుల సంఖ్య: ఒకటి (01) అన్ రిజర్వుడ్ (UR), దివ్యాంగులు (PWD LD (OL)
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

Manager

పోస్టు పేరు: మేనేజర్ (ఐటీ – సెక్యూరిటీ ఎక్స్ పర్ట్) Manager (IT Security Expert)
పే స్కేల్: బేసిక్ రూ.63840-1990/5-73790-2220/2-78230
పోస్టుల సంఖ్య: రెండు (02). అన్ రిజర్వుడ్ (UR), దివ్యాంగులు (PWD LD (OL)-01
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 38 సంవత్సరాలు మించకూడదు.

Deputy Managers

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (నెట్వర్క్ ఇంజినీర్) Deputy Manager (Network Engineer)
పే స్కేల్: బేసిక్ రూ.48170-1740/1-49910-1990/10-69810
పోస్టుల సంఖ్య: పది (10). అన్ రిజర్వుడ్ (UR)-06, EWS-01, OBC-02, SC-1, దివ్యాంగులు (PWD LD (OL)-01
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (సైట్ ఇంజినీర్ కమాండ్ సెంటర్) Deputy Manager (Site Engineer Command Centre)
పే స్కేల్: బేసిక్ రూ.48170-1740/1-49910-1990/10-69810
పోస్టుల సంఖ్య: పది (10). అన్ రిజర్వుడ్ (UR)-06, EWS-01, OBC-02, SC-1, దివ్యాంగులు (PWD LD (OL)-01
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (స్టాటిస్టీషియన్) Deputy Manager (Statistician)
పే స్కేల్: బేసిక్ రూ.48170-1740/1-49910-1990/10-69810
పోస్టుల సంఖ్య: ఆరు (06). అన్ రిజర్వుడ్ (UR)-05, OBC-01, దివ్యాంగులు (PWD LD (OL)-01
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

Qualifications

పై పోస్టులన్నింటికీ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బీఈ లేదా బీటెక్ చేసినవారు అర్హులు. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో వాటికి సమానమైన డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ (స్టాటిస్టీషియన్) పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో 60 శాతం మార్కులతో స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్/ఎకోనోమెట్రిక్స్ లో ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగాలలో అనుభవం కూడా తప్పనిసరి.

How to Apply

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా SBI వెబ్ సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లలో కి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు. అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ: 12, జూన్ 2022.

Documents to be Upload

1. బ్రీఫ్ రెజ్యూమ్
2. ఐడీ ప్రూఫ్
3 డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
4. విద్యార్హతల సర్టిఫికెట్లు (మార్క్స్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్)
5. అనుభవం సర్టిఫికెట్
6. ఫాం-16. ప్రస్తుత సాలరీ సర్టిఫికెట్

పై సర్టిఫికెట్లతో పాటు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు అన్నీ ఏ4 సైజ్లో ఉండాలి. అన్ని కూడా 500 కేబీ సైజ్ లోపే ఉండాలి. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే బ్యాంకు వెబ్ సైట్ లోని CONTACT US/ Post Your Query ఆప్షన్లపై క్లిక్ చేసి పరిష్కారం పొందవచ్చు.

– Regular Jobs in SBI