Circle Based Officer JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Circle Based Officer Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India-SBI) దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (Circle Based Officer) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ (Advt.No.CRPD/CBO/2022-23/22) జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 1,422 (రెగ్యులర్-1,400, బ్యాక్ లాగ్-22) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టెర్న్ సర్కిళ్లలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ లో 176 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Circle Wise Vacancies

మొత్తం పోస్టులు – 1,422

Hyd Circle Posts

హైదరాబాద్ సర్కిల్ లో మొత్తం 176 పోస్టులు ఉన్నాయి. ఇందులో SC అభ్యర్థులకు 26, ST అభ్యర్థులకు 13, OBC అభ్యర్థులకు 47, EWS అభ్యర్థులకు 17, General అభ్యర్థులకు 72 పోస్టులు కేటాయించారు. ఇందులో దివ్యాంగులకు ఏడు (07) పోస్టులు (VI-02, HI-02, LD-02, d&e-01) కేటాంచారు.

Backlog Vacancies
ST-01, HI-05, d&e-05

Qualifications

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

Age Limit

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 30, 2022 నాటికి 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Pay Scale

రూ.36,000 – రూ.63,840

Selection Procedure

ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానిక వన్ బై ఫోర్త్ మార్కు కట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

How to Apply

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా SBI వెబ్ సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లలో కి లాగిన్ అయ్యి సరైన ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • కాల్ లెటర్, ఇంటర్వ్యూ వివరాలు ఈ-మెయిల్ ఐడీకి మాత్రమే పంపిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • డెబిట్,  క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు.
  • అనంతరం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ తో అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • అలాగే, విద్యార్హతలు, కేటగిరీ తదితర సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే 022-2282027 నంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 07, 2022

– Circle Based Officer Jobs