Contract Job

Senior Resident Jobs in NIMS

Senior Resident Jobs in NIMS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన eICU పైలట్ ప్రోగామ్ లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన eICU Spokes లో సీనియర్ రెసిడెంట్ (Senior Resident) పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) (Nizam’s Institute of Medical Sciences-NIMS) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం మూడు (03) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No: SRC/AC-4/564/2021) జారీ చేసింది. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవని. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగాలలో ఎలాంటి ప్రయోజనాలు కల్పించరు. ఇతర నిబంధనలు ఇంటర్వ్యూ సమయంలో వివరిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన eICU Spokes లో ఒక సంవత్సరం (12 నెలలు) పాటు పనిచేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి పొడిగించవచ్చు. eICU Spokes లకు నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా వ్యవహరిస్తుంది.

Details of the Post

పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్ (Senior Resident)
పోస్టుల సంఖ్య: మూడు (03)

Qualifications

అనెస్తీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లేదా వాటికి సమానమైన కోర్సులలో ఉత్తీర్ణులైనవారు అర్హులు. క్రిటికల్ కేర్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Salary

ఉద్యోగాలకు ఎంపికైన సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు నెలకు రూ.80,000 వేతనం చెల్లిస్తారు.

Selection Criteria

సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుతారు. ఇంటర్వ్యూకు వచ్చే సమయంలో అలాగే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేందకు వచ్చే సమయంలో ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వబడదు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది.

How to Apply

  • అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అందులోని వివరాలను పూర్తిగా నింపాలి.
  • అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారి చేత అటెస్టెడ్ చేయించి జతచేయాలి.
  • అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు జతపరచని అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తారు.
  • అభ్యర్థులు పూర్తి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, ప్రస్తుత, శాశ్వత చిరునామా, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు అప్లికేషన్లో నింపాలి.
  • విద్యార్హతలకు సంబంధించిన కోర్సు పాసైన సంవత్సరం, సాధించిన మార్కుల శాతం, డివిజన్, చదివిన యూనివర్సిటీ పేరు రాయాలి.
  • ఒకవేళ NET/CSIR పాసై ఉంటే వాటి వివరాలు, ఇంతకు ముందు పనిచేసిన సంస్థ పేరు, పోస్టు, పనిచేసిన కాలం, ప్రస్తుత పోస్టు రాయాలి.
  • ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ రాయాలి. ఇంకా ఏమైనా అదనపు అర్హతలు ఉంటే కూడా వాటిని తెలియజేయవచ్చు.

పూర్తిచేసిన అప్లికేషన్ ఫాం, సర్టిఫికెట్లు జూన్ 15, 2022 సాయంత్రం 4 గంటల లోపు The Dean, Nizam’s Institute of Medical Sciences, Punjagutta, Hyderabad – 500082 అడ్రసక్కు పంపించాలి. ఎనవలప్ కవర్ పైన పోస్టు పేరు, నోటిఫికేషన్ నెంబర్ రాయాలి. దరఖాస్తులను
పరిశీలించిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ, సమయాన్ని ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

– Senior Resident Jobs in NIMS

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago