SR Jobs in AIIMS : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో గల ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (All India Institute of Medical Sciences-AIIMSAIIMS) సీనియర్ రెసిడెంట్స్ (Senior Residents-SR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదు విభాగాలలో ఎనిమిది (08) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Subjects & Posts
1. అనస్థీషియాలజీ (Anesthesiology) – 01
2. కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్ (Community Medicine and Family Medicine-CFM) – 01
3. డెర్మటాలజీ (Dermatology) – 02
4. జనరల్ మెడిసిన్ (General Medicine) – 02
5. పీడియాట్రిక్స్ (Pediatrics) – 02
(ఈ పోస్టులను ఈడబ్ల్యూఎస్ (EWS)కు 01, అన్ రిజర్వుడ్(UR)కు 01, ఓబీసీ(OBC)కి 04, ఎస్సీ(SC)కి 02 కేటాయించారు.)
Pay Scale: నెలకు రూ.67,700 + ఇతర అలవెన్సులు.
Qualification
సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇనిస్టిట్యూట్
లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (MD/MS/DM/M.ch/DNB)
చేసినవారు అర్హులుఅర్హులు. ఎమెర్జెన్సీ మెడిసిన్ లో MD/DNB చేసిన వారు
జనరల్ మెడిసిన్/ అనెస్తీషియా విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టుకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit
అక్టోబర్ 25, 2022 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03), బెంచ్-మార్క్ డిజేబిలిటీ (జనరల్) అభ్యర్థులకు పది(10), బెంచ్-మార్క్ డిజేబిలిటీ (ఓబీసీ) అభ్యర్థులకు పదమూడు (13),
బెంచ్-మార్క్ డిజేబిలిటీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు పదిహేను (15)
సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
Selection Procedure
దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య పోస్టుల సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. తక్కువగా ఉంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
Application Fee
అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే ముందు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బీబీనగర్ ఎయిమ్స్ బ్రాంచ్ (Bank Name: Bank
of Baroda, Branch: AIIMS Bibinagar, Account Holder Name: AlIMS Bibinagar, Account No.66120100000006, IFSC Code: BARB0(Zero)DBCHND లో అప్లికేషన్ ఫీజు జమ చేయాలి.
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.1,500, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్లూఎస్ అభ్యర్థులు
రూ.1,200 చెల్లించాలి. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు
చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు AIIMS Bibinagar వెబ్ సైట్ లో
(www.aiimsbibinagar.edu.in/) నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని దానిలోని వివరాలన్నీ పూర్తిగా నింపాలి.
అనంతరం అప్లికేషన్ ఫాంతో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన రిసిప్ట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఎస్సెస్సీ అండ్ హెచ్ఎస్ఎస్సి పాస్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్,
MD/MS/DNB/DM/M.ch డిగ్రీ సర్టిఫికెట్, UG/PG రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ఇంకా ఇతర అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటే అవికూడా జతచేసి [email protected] కు మెయిల్ చేయాలి.
Interview Dates & Times
కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ నవంబర్ 02, 2022. రిపోర్టింగ్ టైం 8:00am. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 8:30 am to 9:30 am.
అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్ 03, 2022. రిపోర్టింగ్ టైం 8:00am. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 8:30 am to 9:30 am.
Interview Venue:
Auditorium,
Second Floor,
AIIMS Bibinagar-508126.
Important Points
- ఇవి పూర్తిగా తాత్కాలికమైన పోస్టులు.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపికైన అభ్యర్థులు మూడు (03) సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు మెయిల్ చేసిన అప్లికేషన్ ఫాం, అప్లికేషన్ ఫీజు రిసిప్ట్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాలి.
- అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి.
- ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కే పంపిస్తారు.
- కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు.
– SR Jobs in AIIMS