Staff Nurse Jobs : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited-ECILECIL) స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం నాలుగు (04) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Vacancies
మొత్తం పోస్టులు నాలుగు (04). UR-03, OBC-01
Salary
మొదటి సంవత్సరం నెలకు రూ.20,480
రెండో సంవత్సరం నెలకు రూ.22,258
Qualifications
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(GNM) ఉత్తీర్ణులై స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా బీ.ఎస్సీ(నర్సింగ్)(B.Sc(Nursing)) ఉత్తీర్ణులై స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
పై రెండు కోర్సులు కూడా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు ఆగస్టు 31, 2022 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
How to Attend Interview
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ECILకు చెందిన వెబ్ సైట్ (www.ecil.co.in) ను ఓపెన్ చేయాలి. అందులో Careers పై క్లిక్ చేయాలి. అందులో Current Job Openings పై క్లిక్ చేయాలి. అందులో Advt.No.21/2022లో ఉన్న Application Formను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని
వివరాలన్నీ నింపాలి. ఆ అప్లికేషన్ ఫాంతో పాటు ఎస్సెస్సీ మెమో, ఏదైనా గుర్తింపు కార్డు, నర్సింగ్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇతర ఏమైనా ఉన్నత విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటే వాటిని కూడా తీసుకొని అక్టోబర్ 06, 2022 ఉదయం 9:30 గంటలకు ఈ కింద చిరునామా కు వెళ్లాలి.
Administration Building,
Electronics Corporation of India Limited, NFC Road, ECIL Post, Hyderabad-500062.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్టిఫికెట్లు పరిశీలించి అర్హులైన వారిని ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు.
Important Points
ఈ ఉద్యోగాలుఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
– Staff Nurse Jobs