Staff Nurse Jobs in ITBPF : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (Indo Tibetan Border Police Force-ITBPF) సబ్ ఇన్ స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) (Sub Inspector (Staff Nurse)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి గ్రూప్-బీ, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Sub Inspector (Staff Nurse)
(Group-‘B’ (Non-Gazetted & Non Ministerial))
మొత్తం పోస్టులు – 18
అన్ రిజర్వుడ్ (UR) – 11
ఎస్సీ (SC) – 01
ఎస్టీ (ST) – 02
ఓబీసీ (OBC) – 02
ఈడబ్ల్యూఎస్ (EWS) – 02
Level-6 in the Pay Matrix రూ.35,400 – 1,12,400 (7వ CPC ప్రకారం). ఈ జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 15, 2022 నాటికి 21 సంవత్సరాల నుంచి30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
అలాగే, అన్ రిజర్వుడ్/ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు, ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఆరు, ఎస్సీ, ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎనిమిది, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు టెస్ట్ లలో క్వాలిఫై అయిన అభ్యర్థులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో పెడతారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి నుంచి 10 ప్రశ్నలు, న్యుమరికల్ అప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, ఇంగ్లిష్/ హిందీ కాంప్రహెన్షన్ నుంచి 10 ప్రశ్నలు ట్రేడ్/ ప్రొఫెషన్ రిలేటెడ్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ITBPF వెబ్ సైట్ (www.recruitment.itbpolice.nic.in.) లోకి లాగిన్ కావాలి.
NEW USER REGISTRATION పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ పూరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత ఈ-మెయిల్ కు పాస్వర్డ్ వస్తుంది. వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ITBPF రిక్రూట్మెంట్ వెబ్ సైట్ (www.recruitment.itbpolice.nic.in.) లో మాత్రమే పొందుపరుస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాచారం కోసం తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2022 (రాత్రి 11:59 గంటల వరకు)
– Staff Nurse Jobs in ITBPF
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…