Staff Nurse Jobs in MPMMCC : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గల మహామాన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ అండ్ హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిలో (Mahamana Pandit Madan Mohan Malaviya Cancer Centre & Homi Bhabha Cancer Hospital-MPMMCC) లో నర్స్ (Nusre) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.AD/VAR/2022/021) జారీ అయింది. మొత్తం యాభై (50) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Qualification

  • ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరి (GNM) తో పాటు అంకాలజీ నర్సింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. మరియు 50 పడకల ఆసుపత్రిలో ఒక సంవత్సరం క్లినికల్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీ.ఎస్సీ(నర్సింగ్) (Basic or Post Basic B.Sc. (Nursing)) చేసి ఉండాలి. మరియు 50 పడకల ఆసుపత్రిలో ఒక సంవత్సరం క్లినికల్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
  • క్లినికల్ ఎక్స్ పీరియన్స్ పోస్ట్ బేసిక్ బీ.ఎస్సీ( నర్సింగ్) కు ముందు చేసినా సరిపోతుంది.
  • ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
  • హెపటైటిస్ వ్యాక్సినేషన్ వేసుకొని ఉండాలి.

Age Limit

ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు నవంబర్ 02, 2022 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. టాటా మెమోరియల్ సెంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

How to Attend Interview

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు బయోడేటా, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అనుభవంనకు సంబంధించి సర్టిఫికెట్, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Interview Date & Time :
నవంబర్ 02, 2022,
09.30 am to 11.30 am

Interview Venue :
Homi Bhabha Cancer Hospital,
Old Loco Colony, Lahartara,
Varanasi, Uttar Pradesh-221002.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే [email protected] కు మెయిల్ చేసి గానీ, 0542-2517699 (Extn. 1106 / 1128) నెంబర్లకు ఫోన్ చేసి గానీ తెలుసుకోవచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • పది దినాలు వారంలో ఆరు రోజులు ఉంటాయి.

– Staff Nurse Jobs in MPMMCC